Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Chantabbay
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 188
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, March 08, 2008 @9:52:20 AM EST  

ఉప్పు పిండి:
కావలసిన వస్తువులు. కడిగి ఆరబెట్టిన బియ్యపు నూక (దీనినే వరినూక, లేక మొరుం అంటారు మాప్రాంతంలో)ఒక సోలడు( అంటే కేజీలో నాలుగోవంతు)
రెండు పిడికెళ్ళు పెసరపప్పు
అల్లం పచ్చిమిరపకాయలు( ఇష్టానుసారం )
పోపుసామగ్రి:
సెనగపప్పు
మినప్పప్పు
ఆవాలు
జీలకర్ర
ఇంగువ
కరివేపాకు.

తయారు చేయ్ విధము.

ముందస్తుగా పైన చెప్పిన పోపు సామగ్రితో పోపు వేయించుకోవాలి.
ఆ వేగిన పోపులో రెండు సోలలు నీళ్ళు పోసుకుని బాగా మరగనివ్వాలి.
అలా మరిగిన నీళ్ళలో పక్కనపెట్టి ఉంచుకున్న పెసరపప్పు వెయ్యాలి.
పెసరపప్పు పక్వానికోచ్చిందీ అనిపించగానే దాంట్లో వరినూక వేసి ఉండకట్టకుండా జాగ్రత్తగా కలియబెట్టలి.
నూక ఉడుకుబట్టిందో వెంటనే పొయ్యి ఆర్పేసి కాస్సేపు ఉమ్మగిల్లనివ్వాలి.
ఆ తరువాత దీన్ని పెసరపచ్చడితో నంచుకుతింటే ఉంటుంది.. అన్నట్లు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు ఎప్పుడు వెయ్యాలో చెప్పలేదు కదూ, అవి పెసరపప్పుతో పాటుగా వేసుకోవాలి. అదీ భోగట్టా.



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా