Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Maga Maharaju
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 1958
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 21, 2008 @3:30:40 AM EST  

సివంగి పులుసు.

ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలోని ద్రావిడ బ్రాహ్మణులు ఎక్కువగా చేసుకుంటారు.

కావలసిన వస్తువులు:
టెన్నిస్ బంతికంటే చిన్నగానూ టేబుల్ టెన్నిస్ బంతికంటే పెద్దగానూ ఉన్న వంకాయలు అరడజను.
అల్లం
పచ్చిమిరపకాయలు
ఒక టమాటా


పిడికెడు శనగపప్పు
పిడికెడు ధనియాలు
అరడజను ఎండు మిరపకాయలు
అరడజను మెంతి గింజలు
టేబుల్ స్పూనుడు మినపపప్పు

తయారు చేయు విధము:
పైన చెప్పిన పప్పులూ, ధనియాలూ,మిరపకాయలూ మెంతులను నూనె వెయ్యకుండా పొడిగా వేయించి బాగా చల్లారినతరువాత మెత్తటి గుండగా చేసుకోవాలి.
అల్లం పచ్చి మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని ఈ పొడిలో వేసుకోవాలి.
వంకాయలు బాగా కడిగి, ముచికదాకా నాలుగు పక్షాలుగా తరగాలి.(ముక్కలు కాకూడదు, కాయలాగే కనపడాలి)
అలా తరిగిన వంకాయలలో ఇందాకటి గుండ (అల్లం పచ్చిమిర్చి తో సహా) కూరాలి.
ఒక మూకుడులో కాస్త నూనె వేసి ఈ వంకాయలను అందులో వేసి కాస్సేపు వేచి, కాసిని(ఎక్కువ కాదు) నీళ్ళు పోసి అవి మెత్తబడేవరకు ఉడికించాలి.
ఇప్పుడు చింతపండు రసం తో తయారు చెసిన నీళ్ళలో టమాటా ముక్కలు కోసి వేసి అందులో ఈ కాస్త ఉడికిన వంకాయలు వేసి పూర్తిగా ఉడికించాలి.
రుచికి తగినట్ట్లుగా ఉప్పు వేసుకోవాలి.
వాసన కోసం కొత్తిమిరి వేస్తే బాగుంటుంది.
అలా పులుసు బాగా మరగనిచ్చి తరువాత ఆవాలూ, జీలకర్ర, ఇంగువా కరివేపాకులతో పోపు పెట్టుకోవాలి.
దింపేముందు చిటికెడు పసుపు వేస్తే రంగు బాగా కనిపిస్తుంది.
తరువాత ఏం చెయ్యాలో నేను చెప్పక్కరలేదు. కంచిడన్నం పెట్టుకుని కలియబడిపోవడమేవాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా