Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Maga Maharaju
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 2249
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, August 30, 2008 @10:03:00 PM EST  

మజ్జిగ పులుసు.

కావలసిన వస్తువులు:
చక్కని చిక్కని మజ్జిగ 1/2 లీటరు
ఆనపకాయ ముక్క( దీనినే కొన్ని ప్రాంతాలలో సొరకాయ అనీ మరికొన్ని ప్రాంతాలలో డిప్పకాయ అనీ అంటారు: 150 గ్రాములు బరువున్నది
పుల్ల గుమ్మడి కాయ ముక్క( దీనిని కొందరు బూడిద గుమ్మడికాయ అంటారు):150 గ్రాములు బరువున్నది
బెండకాయలు: అరడజను
బచ్చలి కూర: పావుకట్ట
టమాటా: ఒకటి.
పచ్చి సెనగ పప్పు: పిడికెడు కంటె కొంచెం తక్కువ
కొబ్బరి: 50 గ్రాములు తూగేంత చిన్న ముక్క
అల్లం, పచ్చిమిర్చి: మన రుచిని అనుసరించి
గసగసాలు: ఒక టీస్పూనుడు
ధనియాలు: టీస్పూనుడు
తయారు చేయు విధం.
చక్కని చిక్కని మజ్జిగను బాగా చిలికి పల్చగా చేసుకుని ఉంచుకోవాలి.
పచ్చి సెనగ పప్పును వంటకు ముందే నానపెట్టుకుని ఉంచుకోవాలి
అలా నానపెట్టిన పప్పుకు కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, గసగసాలూ కలిపి రుబ్బుకుని ముద్దచేసుకుని ఉంచుకోవాలి

ఇప్పుడు కాయగూరలు ముక్కలుగా తరుగుకుని( ఆనపకాయ, గుమ్మడి కాయ ముక్కలు ఒక అంగుళం క్యూబులుగా ఉంటే బాగుంటాయి. బెండకాయలు కనీసం రెండించిలు నిడివి ఉంటే బాగుంటుంది. బచ్చలి కూర సన్నగా తురుముకోవాలి.)వాటిని వేరే పాత్రలో నీరుపోసి ఉడికించాలి.రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసుకుంటే కూడా బాగుంటుంది.

అలా ఉడికిన ముక్కలను చిలికి ఉంచుకున్న మజ్జిగలో వేసి, రుచిని అనుసరించి తగినంత ఉప్పువేసుకుని,ఆ మజ్జిగను మరగనివ్వాలి. ఎక్కువగా మరిగితే మజ్జిగ రుచిపాడవుతుంది కనుక రెండు లేదా మూడు పొంగులు వచ్చేటప్పటికి దింపుకోవాలి. కూరముక్కలు వేసినప్పుడే ఇంతకు ముందు రుబ్బి సిద్ధంగా ఉంచుకున్న పిండికూడా వెయ్యాలి.

దింపే ముందు చిటికెడు పసుపు వేసుకోవాలి.

ఆపైన కాస్త నేతిలో ఆవాలూ, మెంతిగింజలూ, ఇంగువా పోపువేసుకోవాలి.

కమ్మని మజ్జిగ పులుసు సిద్ధం. ముద్దపప్పూ, కాచిన నెయ్యీ ఉంటే ఈ మజ్జిగ పులుసు అమృత తుల్యం కాదుటండీ.



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా