Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Chantabbay
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 226
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, March 11, 2008 @8:51:21 AM EST  

ముల్లంగి ఆకులతో పచ్చడి
కావలసిన వస్తువులు(దినుసులు)
అన్నీ
ఒక బల్ల గరిటెడు( టేబుల్ స్పూన్ )
శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు నూలపప్పు

పావు బల్ల గరిటెడు
ఆవాలు, మెంతులు

లేతగా ఉన్నవి ముల్లంగి ఆకులు ( ఆరేడు దుంపలతో వచ్చేటన్ని) బాగా కడిగి ఉంచినవి.

కాస్త నూనెలో పైన చెప్పిన దినుసులన్నీ వేయించుకుని పొడికొట్టి పెట్టుకోవాలి.

కడిగి ఉంచుకున్న ముల్లంగి ఆకులను కొంచెం నూనె వేసి( నీరు అసలు ఉండరాదు) బాగా మగ్గించాలి(ఉడకబెట్టాలి)
ఉడకడం సగంలో ఉండగా కాస్త పసుపు వేసుకోవాలి
ఆకులు బాగా మెత్తబడిన తరువాత ఇంతకుముందు తయారుచేసుకున్న పప్పులపొడి కలిపి రుచికి తగ్గట్టుగా చింతపండూ ఉప్పూ వేసి గ్రైండరులో రుబ్బుకోవాలి.
ఆపైన కాసిని ఆవాలూ, మెంతులూ ఇంగువతో పోపువేసుకుని వేడి అన్నంలో తింటే ఉంటుందండీ.



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా