Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Gang Leader
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 4926
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, February 06, 2009 @1:53:08 AM EST  

నూల్కోలు దుంపలతో కూరలు

1:రొట్టెలలోకి గ్రేవీ కూర

కావలసిన వస్తువులు
నూల్కోలు దుంపలు (టెన్నిస్ బంతి సైజులో ఉన్నవి)2
బంగాళ దుంపలు( హాకీ బంత్ సైజులోవి)2
ఉల్లిపాయలు ( బిలియర్డ్స్ బంతి సైజులో ఉన్నవి) 2
టమాటా(క్రికెట్ బంతి సైజులో ఉన్నది) 1
అల్లం(టేబుల్ టెన్నిస్ బంతి సైజులో)
వెల్లుల్లి(నాలుగు రెక్కలు)
ధనియాల పొడి(ఒక టేబుల్ స్పూనుడు)
కర్రీ పౌడరు ( టేబుల్ స్పూనుడు)
తయారు చేయు విధానము:

ఉల్లిపాయలూ, టమాటా, అల్లం వెల్లుల్లినీ తరిగి ముద్ద చేసుకుని ఉంచుకోవాలి
నూల్కోలూ బంగాళ దుంపలను రూపాయి బిళ్ళ ప్రమాణంలో తరిగి ఉంచుకోవాలి
సన్నని సెగపై మూకుడు(బాణలి) ఉంచి అందులో రెండు మూడు టీస్పూనుల నూనె వేసి నూనె బాగా వేడిక్కిన తరువాత ఈ దుంప ముక్కలు అందులో వేసి ఐదు నిముషాలు వేగనివ్వాలి.
అలా వేగిన ముక్కలలో నీళ్ళు పోసి వాటిని మెత్తపడేవరకూ ఉడకనివ్వాలి.
అలా ఉడికిన ముక్కలలో ముందుగా రుబ్బి ఉంచుక్న్న మూదను వేసి ఉడికించాలి.పిదప చిటికెడు పసపు వెయ్యాలి.
దింపడానికి రెండు నిముషాలముందు ధనియాల పొడి, కర్రీ పౌడరు వేసి ఆ పిదప తగినంత ఉప్పువేసి దింపుకుని రొట్టెలతో తింటే ఉంటుందండీ.......

2. నూల్కోలు నూలగుండ కూర

పైన చెప్పిన వాటిలో ఉల్లిపాయలూ, టమాటా అల్లం వెల్లుల్లీ ఇక్కడ అవసరం లేదు. ధనియాల పొడీ కర్రీ పౌడరు కూడా అక్కరలేదు
బంగాళ దుంపలూ నూల్కోలూ ముక్కలుగా తరుగుకొని
వాటిని మెత్తపడేవరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి
ఇప్పుడు ఈ విధంగా పోపు తయారు చేసుకోవాలి
శెనగ పప్పు టేబుల్ స్పూనుడూ
మినప్పప్పు అంతే
రెండు ఎండు మిరపకాయలు
కాసిని ఆవాలూ
కాసంత ఇంగువా వేసి పోపు పెట్టుకుని
ఆ పోపులో ఉడికించి ఉంచుకున్న దుంప ముక్కలు వేసి
బాగా కలియబెట్టిన తరువాత
నూలపప్పు పొడి(నాలుగు లేదా ఐదు టబుల్ స్పూనులతో) జల్లి
రెండు నిముషాల తరువాత దింపుకోవాలి.
వేడి అన్నంలో వేడి కూర తింటే రంజుగా ఉంటుంది.



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా