Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : !!! బ్రేక్ ఫాస్ట్ / లంచ్/డిన్నర్ మెనూ !!!

PostedBy Message

Srivenu
Maga Maharaju
Name: Vb

Post Number: 2054
Points: 99,140
Member Since: Mar 13, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, September 22, 2008 @1:53:11 PM EST  

గోంగూర చికెన్ !

Courtesy: మా టీవీ వారి ' మా ఊరి వంట '

కావాల్సిన పదార్ధాలు ( క్వాంటిటీ ఎంతని మాత్రం అడక్కండి ):

బోన్ లెస్ స్కిన్ లెస్ చికెన్
గోంగూర
కారం
ఉప్పు
పసుపు
నూనే
ఉల్లి పాయలు
పచ్చి మిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, యాలుకలు వేపి మిక్సీ లో వేసి పొడిగా చేసుకోవాలి.
పుదీనా
కొత్తిమీర

తయారు చేయు విధానం :

ముందుగా ఒక గిన్నె లోకి చికెన్ ని తీసుకుని కొంచెం నూనే, పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెసి కలిపి ఉంచుకోవాలి.

పాన్ పెట్టి, దాంట్లో కొంచెం నూనె వేసి, పచ్చి మిర్చి ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి కొంచెం వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి కొంత వేయాలి. 1 నిముషం తరువాత కలిపి ఉంచిన చికెన్ ని వెయ్యాలి. దానికి ఉప్పూ, కారం యాడ్ చెయ్యాలి. అంతా కలియ తిప్పుతూ చికెన్ ని వేయించాలి.

మరొక పక్క ఒక చిన్న పాన్ లోకి తగినంత గోంగూర ని వేసి, కొంచెం నూనె వేసి 2 నిముషాలు వేయించాలి. అది ఒక పక్కన పెట్టుకోవాలి.

చికెన్ తగిన వేగ గానే గోంగూర ని యాడ్ చెయ్యాలి. గొంగూర ఇంకా ఆకుల్లాగ్ ఉన్నట్లైతే కొంచెం నీరు పోసి మిక్సీ లో వేసి దానిని చికెన్ లో కలుపుకోవచ్చు.

అలా గోంగూర చికెన్ ని కాసేపు ఉడకనిచ్చి, చివరలో పుదీనా, కొత్తిమీర చల్లి దింపుకోవటమే !

గోంగూర బదులుగా, చుక్క కూర, చింత చిగుర్తుఓ కూడా చేసుకోవచ్చు ఇదే విధానం తో..