Type In Telugu
Article 1008


కనువిప్పు కలిగించిన చాట్   (Page 1 Of 5)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1751
Votes: 7  (Vote) Posted On 12/18/2011 @5:00:00 PM

        "ఏమండి ఏడు అయ్యింది నిద్ర లేస్తారా?" అన్న భార్య అనిత పిలుపుతో విసుక్కుంటూ నిద్ర లేచాడు శ్రీధర్. గబ గబ బ్రష్ చేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఏమైనా మెసేజెస్ వచ్చాయేమోనని యాహూ చాట్ ఓపెన్ చేశాడు. "ఏంటి తను ఏమీ మెసేజెస్ పెట్టలేదు" అనుకుని "ఓ వీకెండ్ కదా తనకి కుదరదని చెప్పిందిగా" అని గుర్తుకొచ్చింది. ఇంతలో అనిత వేడి వేడిగా కాఫీ చేసి తీసుకువచ్చింది. అది త్రాగుతూ తనకి పరిచయమైన మాధురి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

***        ***        ***        ***

        మాధురి పరిచయమై ఆరు నెలల పైనే అవుతోంది. మొదట ఒక ఫ్రెండ్ లాగా పరిచయమై ఇప్పుడు ఫ్రెండ్ స్టేజ్ దాటి పోయి ఏదో చెప్పుకోలేని బంధం ఏర్పడింది. మాధురికి ముందు తను చాలా మంది ఆడవాళ్లతో చాటింగ్ చేసినా, మాధురి అంత దగ్గరగా ఎవరూ రాలేదు. తనని నేను, నన్ను తను చూడలేదు. తనకి పెళ్ళైందని, పిల్లలున్నారని, భర్త అంత కేరింగా ఉండడని మాత్రమే తెలుసు అంతకు మించి పెద్దగా తెలియదు. నేనూ పెద్దగా అడగలేదు, తనూ చెప్పలేదు. తనకి తెలుసు నాకు భార్యా పిల్లలు ఉన్నారని అంతే! కాబట్టి ఎవరికీ ప్రాబ్లం లేదు. మేమిద్దరం చేస్తున్నదాంట్లో తప్పేమి లేదనిపించింది. కానీ ఇది అనితకు తెలిస్తే? తనకి తెలియకుండా 6 నెలలపైనుండే మెయింటైన్ చేస్తున్నా ఇక తెలిసే ప్రసక్తే లేదు. అయినా నేనేమి తనకి లోటు చేయటం లేదు కదా అని మనసు సర్ది చెప్పుకున్నాడు.

***        ***        ***        ***

        ఇంతలో పిల్లల్ని లేపి వస్తున్న అనిత ఏదో ఆలోచిస్తున్న భర్త కనపడేసరికి, "ఏంటో ఈ మధ్య ఈయనలో ఏదో మార్పు కనిపిస్తోంది, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటారు" అని అనుకుంటూ "ఏంటండి ఆలోచిస్తున్నారు" అన్న భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి "అబ్బే ఏమి లేదు" అని "పిల్లలు లేచారా" అని ఆ గదిలో నుండి వెళ్ళిపోతున్న భర్త వంక వింతగా చూసింది అనిత.

        పిల్లలకి పాలు పట్టి తను స్నానికి వెళుతూ "ఏమండి పిల్లలు గొడవ చేస్తున్నారు పార్క్ కి వెళదామా" అంది అనిత.


View Comments(6)    Post a Comment    By - శ్రీరాధ
 
      1  2  3  4  5         Page