Type In Telugu
Article 1012


నీటి వృధాని అరికట్టండి   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 930
Votes: 3  (Vote) Posted On 12/28/2011 @11:24:04 AM

        “చూడండి .. ఆ పెద్దావిడ కుళాయి నీటిని యెలా వేస్ట్ చేస్తుందో...!" చూపిస్తూ అంది సరళ.

        ఆ పెద్దావిడ కుళాయి తిప్పి నీటిని వదిలేసింది. నీటిధార వేగంగా పోతూవుంది. ఆవిడ మాత్రం కొంచెం కొంచెం నీటిని చేత్తో అందుకొని ముఖం కడుగుకుంటూ వుంది. రెండు మగ్గులు నీళ్ళయితే సరిపోయేదానికి బకెట్ నీళ్ళు వృధా చేసింది. ఒక వేళ ఆ పెద్దావిడను "అలా నీళ్ళెందుకు వృధా చేస్తున్నావని అడిగితే మోటార్ కరెంట్ బిల్లు కట్టుకునేది మేమే .... మీకెందుకంత బాధ.." అని చెప్పచ్చు.

        "అదిగో .. అటు చూడు ... !" అరవింద్ సరళకు చూపాడు. అక్కడ ఓ ఆవిడ వీధి కుళాయి క్రింద బకెట్ పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. బకెట్ నిండి నీళ్ళు పొర్లిపోతున్నాయి. పట్టించుకోలేదు. అది వీధి కుళాయి. ఆ నీళ్ళు ఎలా పోతే మనకెందుకు... ! అనేది ఆవిడ అభిప్రాయం కావచ్చు.

        ఇంట్లో మోటార్ నీళ్ళయినా, పబ్లిక్ కుళాయి నీళ్ళాయినా… నీటిని వృధాగా పోనివ్వటం మంచిది కాదు. ప్రకృతిలో సహజవనరుగా మనకు లభ్యమయ్యే నీరు ఎంతో విలువైనది. భూమి జీవమున్న గ్రహం కావడానికి కారణం… ఇది జలయుత గ్రహం కాబట్టే...! ఉచితంగా దొరుకుంది కదాని అలక్ష్యం చేస్తే ... భవిష్యత్తులో నీటికి తీరని కరువొచ్చే ప్రమాదముంది.

        ఇప్పటికే నగరాలు, పట్టణాలు, పెద్ద పెద్ద పల్లెల్లో త్రాగటానికి నీళ్ళు కొనుక్కొంటున్నారు. నీరు క్రమక్రమంగా ఆర్ధిక వస్తువుగా మారుతూ వుంది. నదీ జలాల పంపకాల్లో రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు ప్రారంభం కావటం చూస్తున్నాం.

        నీరు ప్రకృతిలో లభించే సహజ వనరు. నీరు మానవులకు, ఇతర జీవ రాశులకు అత్యంత అవసరమైనది. ఇప్పటికే ఈ ఉచిత వస్తువు .... నగరాలు, పట్టణాలలో ఆర్ధిక వస్తువుగా రూపాంతరం చెందింది. నీటి విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించక పోతే భవిష్యత్ లో నీటి యుద్ధాలు తప్పవు. ( ప్రస్తుతం వీధి కుళాయిల దగ్గర బిందెల యుద్దం చూస్తున్నాం గా.. !)


View Comments(2)    Post a Comment    By - Audisesha Reddy Kypu
 
      1  2         Page