Type In Telugu
Article 540

Post an Article

పురాణాల్లో సైన్స్   (Page 168 Of 169)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1977
Votes: 16  (Vote) Posted On 8/29/2010 @6:51:48 PM

37. మహాత్ముల తేజస్సు - కిర్లియన్ ఫోటోగ్రఫీ



        సృష్టి యందలి ప్రతి పరమాణువులోనూ (దైవ)శక్తి ఉందనేది "ప్రాచీన హైందవ విజ్ఞాన సిద్ధాంతం". నిర్జీవుల కంటె జీవుల్లో ఆ శక్తి హెచ్చుస్థాయిలో ఉంటుంది. అందువల్లనే వాటి సామర్థ్యం కూడా హెచ్చు. జీవుల్లో, అందునా మానవునిలో ఉన్న శక్తి మరీ అపారం. మానవుని తయారీ అనేది సృష్టిలోనే ఒక అద్భుతం.

        హెచ్చుగా (దైవ)శక్తి ఉన్న కారణాన, మానవునికి ఒక దివ్య తేజస్సు ఉంది. అది అతని "ప్రాణశక్తి". ఆ శక్తి అతని శరీరాన్ని కూడా దాటి, కొంతవరకు గాలిలో ప్రసరిస్తూ ఉంటుంది. తల దగ్గరయితే ఆ శక్తి మరింత హెచ్చుగా ఉంటుంది. ఐతే, మనిషి చుట్టూ ఉండే ఈ శక్తిక్షేత్రం మన కళ్ళకు మామూలుగా కనపడదు. ఈ విషయాలన్నీ ఆధునిక శాస్త్రవేత్తలు సైతం నిర్ధారణ చేశారు. ఈ శక్తిక్షేత్రం బలంగా ఉన్నవారు ఇతరులను హెచ్చుగా ఆకట్టుకోగలుగుతారని శాస్త్రవేత్తలు తేల్చారు.

        కిర్లియన్ ఫోటోగ్రఫీ :

        "కిర్లియన్ ఫోటోగ్రఫీ" పేరిట ఒక ప్రత్యేకమైన ఆధునిక ఫోటోగ్రఫీ విధానం ఉంది. ఈ ఫోటోగ్రఫీ ద్వారా మనిషికి సంబంధించిన ' తేజస్సు 'ను, అనగా ' శక్తిక్షేత్రాన్ని ' ఫోటో తీయడం సాధ్యం. ఈ శక్తిక్షేత్రం తల వద్ద మరింత బలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా! ఈ ఫోటోగ్రఫీ ద్వారా మనిషిలోని తేజస్సును అతని తల వద్ద స్పష్టమైన "కాంతివలయం" గా చూడవచ్చు! ఈ కాంతివలయం యొక్క స్పష్టత, అతనిలోని తేజస్సును బట్టి ఉంటుంది. హెచ్చు తేజస్సు కలిగివున్న వ్యక్తికి, చాలా ప్రకాశవంతమైన కాంతివలయం ఏర్పడివుంటుంది. వ్యక్తులలోని అంతర్గత శక్తుల హెచ్చుతగ్గులను బట్టి వివిధ రంగుల్లో వ్యక్తుల తేజస్సులు ఈ ఫోటోగ్రఫీలో గోచరమౌతాయి.

        వ్యక్తిలోని ' తేజస్సు 'ను (లేదా ప్రాణశక్తిని, లేదా జీవశక్తిని) చూపగలిగే ఈ విధమైన ఫోటోగ్రఫీనే "కిర్లియన్ ఫోటోగ్రఫీ" అంటారు. దీన్ని విదేశాల్లో ఆధునికకాలంలో కనుగొనడం జరిగింది. ఐతే, ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ లాంటివి లేకుండానే, మనిషిలోని తేజస్సును గురించి మన ప్రాచీన హైందవులకు తెలుసు!


View Comments(81)    Post a Comment    By - Satyanarayana Piska
 
      164  165  166  167  168  169