Type In Telugu
Article 692


ముత్యాల జల్లు కురిసే   (Page 1 Of 7)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1845
Votes: 11  (Vote) Posted On 6/23/2009 @6:58:05 PM

        "ఆంధ్రాఫోక్స్"......................... ఒక ఆంధ్రుడు "అచ్చ తెనుగు నేస్తాలకై ముచ్చటగా నేసుకొన్న పచ్చిపూల పందిరి".

        నాలుగు అక్షరాల సైటు నలుదెసలనుంచీ మెంబర్స్ ని తీసుకొచ్చింది. వారిలో సంగీతమనే సంపెంగలనూ, సాహిత్యమనే సన్నజాజులనూ ,విద్వత్తు నిండిన గులాబీలనూ వివేకాన్నిచ్చే విశ్లేషకుల దారాలతో ముడిపెట్టి కదంబాన్ని చేసే ప్రయత్నమే మీట్స్ ముఖ్యోద్దేశ్యం.

        మొదట 2008 అక్టోబర్ 2వ తేదీన మీట్ హైదరాబాద్ లో జరిగిన సందర్భంలో, సైట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ 2009 జూన్ లో ఇండియా వస్తున్నట్లు చెప్పినప్పుడు మెదలిన చిన్ని ఆలోచనే 13.06.2009న యాత్రి నివాస్ లో కురిసిన ఆంధ్రుల ఆనందాల హేల.

        దాదాపు 6 నెలల నుంచీ అందరూ రావాలని కోరుకొంటూ అందరికీ తెలియజేయడం జరిగింది. వజ్జాగారి సహకారంతో యాత్రినివాస్ లో మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొందరు నిరాసక్తతగా, మరికొందరు ఆరాటంగా, ఎలా అయినా, ఆ మీట్ కోసం అందరూ వెయిట్ చేసారు. మే 28కి సుబ్బు సర్ అలియాస్ మణ్యంజీ ఉరఫ్ డీ ఎస్ జీ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. వెంటనే కాల్ చేసారు పద్మ గారూ వచ్చేసాం, 4త్ వరకూ బిజీ ఉంటాం అని. సరేలెండి మీరు ఫ్రీ అయ్యాక యాత్రినివాస్ కి వెళ్ళీ వెన్యూ ఫైనలైజ్ చేసి వస్తారు కదా అని అడిగి కన్ ఫరం చేసుకొన్నాను. తప్పకుండా అన్నారు. ఈలోపు కింకర్జీ అలియాస్ శ్రీనివాస్ అందరికీ తన ప్రయాణపు వివరాలు చెప్పి మరీ స్వదేశీయానానికి పయనమయ్యారు.

        4త్ మార్నింగనుకొంటాను శ్రీనివాస్ గారు కాల్ చేసారు, ఓ 2/3 డేస్ బిజీ ఉంటామండీ అంటూ. అదే రోజు ఆల్ఫా అలియాస్ కృష్ణబాబు మెసేజిచ్చారు "పద్మాజీ ! ఎక్కడెక్కడివారినో స్నేహమనే బంధంతో కలుపుతున్న ఆంధ్రాఫోక్స్ అధినేతకు మనం ఏమీ ఫెలిసిటేషన్ ఏర్పాటు చేయట్లేదా?" అని.

        అప్పటివరకూ ఆ ఆలోచనే లేదు, ఇప్పుడెన్ని తిట్టుకొంటే ఏమి అనుకొంటూ "దాందేముంది సార్ అలాగే చేద్దాం మంచి ఆలోచన చెప్పారు" అన్నాను. నాకు కాస్త ఇంటిమసీ ఉన్న ఒకరిద్దరితో ఈ మాట చెపితే మీకే సపోర్ట్ కావాలన్నా ఇస్తాం అన్నారు.

        5త్ సుబ్బు సర్, కమల్ జీ వెళ్ళి యాత్రినివాస్ చూసి మెనూ ఆర్డర్ చేసారు.(రాజేష్ బైక్ మిస్ చేసుకొని వెళ్ళలేకపోయాడోచ్) అప్పుడు కన్ ఫర్మేషన్ వీలు కాక ఈవినింగ్ రాజేష్ అలియాస్ కంత్రీ తో వెళ్ళి కన్ ఫర్మ్ చేసి వచ్చారు. సుబ్బు సర్ తో ఆల్ఫా గారు అన్నమాట చెపితే "సరే అలాగే చేద్దాం. ఎలా చేయాలో మీరు ఆలోచించండి" అన్నారు.


View Comments(32)    Post a Comment    By - Padma Sreeram Vangara
 
      1  2  3  4  5         Page