Type In Telugu
Article 704


ఫోక్స్ మీట్ - జూన్ 2009   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1567
Votes: 5  (Vote) Posted On 6/25/2009 @11:30:02 PM

        జూన్ ఐదోతారీకు, తెల్లవారింది. లేచి నేనూ, మా ఆవిడ కలిసి వాకింగ్ కి వెళ్ళి వచ్చాం. తరవాత స్నానం అదీ ముగించుకొని, ఈ రోజు యాత్రీ నివాస్ కి వెళ్ళి ఫోక్స్ మీట్ కి మెనూ ఫైనల్ చేసి రావాలి అనుకున్నా. అంతకు ముందు రోజే పద్మ గారు కాల్ చేసి "సార్ పనులన్నీ అయ్యాయా? ఇప్పుడు ఫ్రీ అయ్యారా" అని అడిగారు. "అయ్యాయి అండి. రేపు పొదున్న యాత్రీనివాస్ కి వెళ్ళి మెను ఫైనల్ చేద్దామని అనుకుంటున్నా" అని చెప్పాను. పద్మ గారు సంతోషంగా పచ్చజండా ఊపారు.

        ఉదయం 10 గంటలకల్లా యాత్రీ నివాస్ కి నా తూనీగ (అదే స్కూటీ )మీద బయలుదేరాను. మెనూలో ఏమి ఐటమ్స్ పెట్టాలో అని ఒకటే ఆలోచన. ఏదైనా అందరికీ నచ్చేది తినగలిగేది పెట్టాలి. మధ్య దారిలో ఉండగా పద్మ గారు మళ్ళీ కాల్ చేసారు. "సార్ మీకు తోడుగా రాజేషూ, కమల్జీ యాత్రీనివాస్ కి వస్తున్నారు. వాళ్ళు 10 గంటలకి అక్కడ ఉంటామన్నారు" అని చెప్పారు.

        యాత్రీ నివాస్ కి చేరేప్పటికి 10:20 అయ్యింది. నేను చేరిన 5 నిముషాలలో కమల్జీ కూడా చేరారు. కమల్జీని అంతకుముందే ఒక సారి కలవటం వలన గుర్తుపట్టటం పెద్ద కష్టం కాలేదు. అక్కడి నుంచే వజ్జా గారికి కాల్ చేసాను. "మామా (నేను వజ్జా గారిని మామా అని ఆయన నన్ను మామా అని పిలుచుకుంటాం) నేను హైదరాబాదుకి చేరాను. ఎలా ఉన్నావు ఏమిటి సంగతులు?" అని అడిగాను. "మామా నాన్నగారు ఇక లేరు" అన్నారు. నాకు ఒక్క క్షణం నోటి మాట రాలేదు. "అయ్యో వెరీ సారీ మామా" అన్నాను ఎలాగో గొంతు పెగల్చుకొని. "అనుకున్నదే కద మామా. అందుకే మేమంతా మెంటల్ గా ప్రిపేర్ గానే ఉన్నాము" అని, మళ్ళీ "చెప్పండి మామా ఏమిటి సంగతులు?" అని తానే అడిగారు. నేను సందిగ్దంలో పడ్డా. ఇలాంటి సమయంలో మీట్ గురించి మామా ని ఎలా అడగను అనేదే నా ఆలోచన. ఎలాగో "మామా ఇప్పుడు నేను, కమల్జీ యాత్రీ నివాస్ లో ఉన్నాము. నీకు తెలుసు కదా మన మీట్ కోసం మెనూ ఫైనలిజ్ చేద్దామని వచ్చాం" అన్నాను. దానికి ఆయన "మామా బాంక్విట్ హాల్ నా పేరున బుక్ చేసాను. అక్కడ రాయ్ అనే ఆయన ఉంటాడు ఆయన్ని కలిసి మీ మెనూ ఇవ్వు. మిగతాది నేను రాయ్ తో మాట్లాడతా. మెనూ ఫిక్స్ అయ్యాక నాకు కాల్ చెయ్యి" అని చెప్పారు. "థాంక్స్ మామా" అని డిస్కనక్ట్ చేసా.

        ఈ లోగా కమల్జీ రాజేషుని కాంటాక్ట్ చేసాడు. రాజేషు బైక్ కి ఎదో ట్రబుల్ అందుకని రాలేదు మనమే మెనూ ఫైనల్ చేద్దాం అని చెప్పాడు. ఇద్దరం కలసి సదరు ' రాయ్ ' కోసం వేట ప్రారంభించాం. తీరా తెలిసినదేమిటంటే రాయ్ కి 3 గంటల నుండి డ్యూటి అని అప్పుడు కానీ దొరకడని తెలిసింది. అతని ఫోన్ నంబరు తీసుకుని మళ్ళీ మూడు గంటలకి రావాలి అనుకుంటూ బయటకి వచ్చాము. కమలజీ కి సాయంకాలం ఏదో మీటింగ్ ఉండటం వల్ల తాను రాలేక పోవచ్చును అని చెప్పాడు. రాజేషుకి కాల్ చేసి రమ్మని చెప్తా అని అన్నాడు. సరే ఐతే ఐదు గంటలకి ఇక్కడకి రమ్మని చెప్పు అని చెప్పి బయలుదేరే లోపల మళ్ళీ పద్మ గారి కాల్...


View Comments(20)    Post a Comment    By - Devarakonda Subrahmanyam
 
      1  2  3  4         Page