Type In Telugu
Article 721

Post an Article

బండబాబు --- కొండప్రయాణం   (Page 1 Of 5)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 400
Votes: 8  (Vote) Posted On 7/6/2009 @3:13:00 PM

        టైటిల్ అయితే పెట్టానుకాని కింద ఏమి రాయాలో అర్థం కాక అద్దం ముందు కూర్చుని ఆలోచిస్తున్నా. ఇంతలో అద్దంలోనుంచి ఒక గొంతు "ఎక్కువ ఆలోచించకు, ఎవరన్నా చూస్తే నువ్వు నిజంగానే రైటర్ వి అనుకుంటారు" అన్నది.

        ఎవరా అని చూస్తే నా అంతరాత్మ వైట్ అండ్ వైట్లో దర్శనం ఇచ్చింది.

        "ఆఁ ఆలోచించకేంచెయ్యను, రాయాలని ఉంది కానీ ఏమీ తోచటంలేదు మరి" అని అన్నాను.

        దానికి నా అంతరాత్మ "మొన్న పరీక్షల్లో తెలియని ప్రశ్న వస్తే ఏం చేశావు?" అని అడిగింది.

        "ఆఁ ఏం చేశాను, ఏదో సొంత ప్రయోగం చేసి రాసొచ్చా" అని జవాబిచ్చా.

        "కదా! ఇప్పుడు అదే చెయ్యి, టైటిలే ప్రశ్న అనుకో రెచ్చిపో, అర్జునా అదిగో పిట్ట ఇదుగో బాణము అన్న స్టైల్లో" అని మాయమయ్యింది.

        ఆ ధైర్యంతో ఇలా మొదలు పెట్టాను...

        చెప్పటం మరిచా, ఇందులో టైటిల్ రోల్ నాదేనండోయ్. ఇప్పుడు బండబాబు అంటే అర్థం అయ్యింది కదా? ఇక కొండ ప్రయాణానికి వెళ్దాం పదండి.

        అది జూన్ 6వ తారీఖు, బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. నేను ఇంట్లో అటూ ఇటూ తచ్చాడుతున్నాను. ఇంతలో నా ఫోన్ రింగయ్యింది. ఎవరబ్బా అనుకుంటూనే యాక్సెప్ట్ చేశా.

        అవతల నుంచి ఒక గొంతు "హలో బాస్ నేను" అన్నది.

        ఇంతకు ముందు విన్న గొంతే అయినా చెప్పండి శ్రీనివాస్ గారు అనటానికి కొంచెం కష్టపడ్డా ఎక్కడ చాట్ లోలా యమా అనేస్తానేమోనని. అప్పుడు మాటల్లో యమా "నేను తిరుపతి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా" అనడిగారు. అప్పుడు ఏమీ చెప్పలేక ఏ విషయం తర్వాత చెప్తానని చెప్పాను.

        అప్పటివరకూ తిరుపతి వెళ్ళని నేను, ఆ శ్రీనివాసుడి వద్దకు ఇద్దరు శ్రీనివాసులతో వెళ్ళాలని రాసిపెట్టుందో ఏమో కానీ, "వస్తాను" అని మర్నాడు కాల్ చేసి చెప్పాను. చారీ గారు కూడా వస్తున్నారని తెలిసింది. ఆ మరుసటి రోజు యమా గుంటూర్లో వారి మామయ్యగారింట్లో ఉంటే నేను మా నాన్న గారితో వెళ్ళి కలిశాను. అవీ ఇవి మాట్లాడుకుని మర్నాడు ఉదయం 7గంటలకు బయలుదేరుదాము అని ఫిక్స్ చేసుకున్నాం (అప్పటికి చారీ గారికి ఏదో వర్క్ వల్ల రాలేకపోతున్నారని తెలిసింది).


View Comments(23)    Post a Comment    By - Mr V
 
      1  2  3  4  5