Type In Telugu
Article 732


కుశ లవులకు కూసింత చేయూత   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1460
Votes: 3  (Vote) Posted On 7/7/2009 @8:21:34 PM

        జూన్ 13వ తేదీన ఫోక్స్ మీట్ ముగిసే సమయంలో ఆంధ్రఫోక్స్ సభ్యుల నుండి శ్రీ సుబ్బు గారు సేకరించిన లవకుశల విరాళాలు ఎవరి ద్వారా అందచేయాలంటూ కొన్ని తర్జనబర్జనలు అయ్యాక, లవుడు పాత్రధారి అయిన శ్రీ నాగరాజు గారికి చారీగారితో కలిసి నేను, కుశుడు పాత్రధారి అయిన శ్రీ సుబ్రమణ్యం గారికి రాజేష్ అలియాస్ ఆల్టర్నేట్ అలియాస్ కంత్రీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు.

        మరుసటి రోజైన ఆదివారం, చారీ గారి పరీక్ష ముగిసిన వెంటనే, తనూ నేను కలిసి శ్రీ నాగరాజు గారి ఇంటికి బయలదేరాము. ముందురోజే విరాళాల విషయం ఫోన్ ద్వారా చెప్పి ఉన్నాను శ్రీ నాగరాజు గారికి. ఆయన నివాసం ఉండే చోటుకు చేరే ముందు ఫోన్ చేస్తే "మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఇంటి వద్దనే ఉండండి" అని చెప్పారు.

        ఆంధ్రఫోక్స్ కి ఇంటర్వ్యూ, ఆయన నివసించే ఇంటిలో కాకుండా, ఆయన కజిన్ ఇంటిలో ఇచ్చారు. ఆ ఇంటి వద్దే వేచి ఉన్నాము. పదినిమిషాలలో ఆయన తెల్లని పైజమా కుర్తా, నుదట నిలువునా తిలకంతో దర్శనం ఇచ్చారు. వచ్చిరాగానే "అలా పార్క్ లోకి వెళదామా" అని అడిగారు.

        "వద్దు సార్! మీ ఇంటికి వెళదామండీ" అని నేను అన్నాను.

        నా మాటలకు కాస్త సంశయిస్తూ "అయ్యో వద్దండీ, ఓపన్ గా చెబుతున్నా. నేనుంటున్నది ఒకే ఒక చిన్న ఇరుకైన గది. అలా పార్క్ కి వెళితే బావుంటుందేమో?" అన్నారు.

        నేను మాత్రం ఆయన గారి ఇల్లు, పరిస్థితి చూడాలన్న ఉద్దేశంతో "లేదండీ, మీ ఇంటికే వెళదాము, ఎలా ఉన్నా పర్లేదు" అని అన్నాను.

        అయిష్టంగానే ఒప్పుకొన్నారు.

        ఒక పెద్ద కాంపౌండ్ లో పెద్ద ఇంటికి వెనకాల చిన్న చిన్న గదులతో కొన్ని ఇళ్ళు ఉన్నాయి. వాటికి వెళ్ళే దారి కూడా చిన్నగా, ఒక మనిషి పట్టే విధంగానే ఉంది. అవి దాటుకొని చివర్లో రెండు మూడు చిన్న చిన్న రూమ్స్ తో ఉన్న ఇళ్ళు కనపడ్డాయి. అన్నీ సింగల్ రూములే. అందులో, ఒక ఇంటిలో ఉంటున్నారు నాగరాజు గారు. ఇంటి నిండా సామానులతో, ఇద్దరు మనుషులు నిద్రపోవడానికి కూడా స్థలంలేని గదిలో ఆయన ఉంటున్నారు. మేము వెళ్ళగానే, నేల మీద పడుకొని ఉన్న ఆయన గారి శ్రీమతి లేచారు గాభారాగా..! ఇంకో మనిషి కూర్చోవడానికి కూడా జాగా లేదు అక్కడ. అది చారీ గారు, నేను చూసి, బాధతో వెనక్కు వచ్చాము.


View Comments(10)    Post a Comment    By - Kamal
 
      1  2         Page