Type In Telugu
Article 760


' ఆమె ' లేని రోజు .....   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1438
Votes: 7  (Vote) Posted On 7/30/2009 @12:05:56 AM

        కిటికీ తెరిచి మళ్ళీ ఒక సారి ' ఆమె ' వచ్చిందేమో అని చూసాను. లేదు! మళ్ళీ అదే అనుభవం. ' ఆమె ' ఉన్నన్ని రోజులు ఎంత సందడిగా ఉండేది. ఇల్లంతా బంధుమిత్రులతో పెళ్ళివారి ఇల్లులా కలకలలాడుతుండేది. వచ్చేవారు, పోయేవారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పాటలు, పద్యాలు, కవితలు, కథలు ఇలా ఒకటేమిటి, అన్ని విషయాలకి ఆలవాలం ఆమె ఇల్లు. అందుకే రోజూ ఆమె ఇంటికి వెళ్ళటం అలవాటైపోయింది.

        ఇక్కడ ఆమె ఇంటి గురించి చెప్పటం సమంజసం అనుకుంటాను. ఆ ఇంటిని ఇల్లు అనటం కంటే పెద్ద భవనం అంటే బాగుంటుంది. ఆ భవనంలో ఎన్నో గదులు. ప్రతిగదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కార్యక్రమం. ఒక గదిలో పాటలు, ఇంకో గదిలో సాహిత్య చర్చలు, మరో గదిలో జోకులు. ఇలా ప్రతి గదిలో ఏదో ఒక సంగతి మీద చర్చలు జరుగుతునే ఉంటాయి. ఆ భవనానికి వచ్చిన ప్రతివారిని నవ్వుతూ పలకరించి తలుపు తీసే ' ఆమె ' రోజుకో కొత్త రంగులో కనిపించేది.

        అలాంటిది ఆ భవనం ఒక్క సారిగా మూగపోయింది. మిత్రులంతా ఎప్పటిలాగానే ఆ భవనానికి వస్తున్నారు కానీ ' ఆమె ' ఎవరికీ తలుపు తీయలేదు. అందరు నిరాశతో ఆమె ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తలుపు తీస్తుందా అని ఆశగా ఎదురు చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నారు.

        నా పరిస్థితి ఐతే చెప్పనవసరం లేదు. రోజూ ప్రొద్దున్నే అక్కడికి చేరటం నా దినచర్యలో ఒక భాగం ఐపోయింది. నా పని కూడా అక్కడి నుంచే చేసుకునేవాడిని. ఒక్క తిండికి, నిద్రకీ తప్ప అన్నీ అక్కడే అని చెప్పాలి. అలాంటిది ' ఆమె ' మౌనం నాకు బాధగానే ఉంది. అసలు ఏమి జరిగిందో అర్థం కాలేదు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. పిచ్చిపట్టినట్టుగా ఉంది నా పరిస్థితి.

        అంతలో దూరంగా ఆ ఇంటి పెద్ద నీరసంగా వస్తు కనిపించారు. మనిషి బాగా డీలా పడ్డారు. నిన్నటి ఉత్సాహం లేదు ఆయనలో.

        ఆయన కనపడగానే అక్కడ చేరివాళ్ళంతా "అయ్యా ఏమి జరిగింది? ఇంటి తలుపులు ఎందుకు మూసివేసారు? ' ఆమె 'కు ఏమి జరిగింది? మీరెందుకు అంత డీలాగా కనిపిస్తున్నారు?" అంటూ ప్రశ్నల వాన కురిపించారు.


View Comments(23)    Post a Comment    By - Devarakonda Subrahmanyam
 
      1  2  3         Page