Type In Telugu
Article 872

Post an Article

మహాకవి కాళిదాసుకు యాభై ఏళ్ళు!   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 113
Votes: 2  (Vote) Posted On 4/2/2010 @4:06:59 AM


        1960 ఏప్రిల్ 2 వ తేదీన "మహాకవి కాళిదాసు" చిత్రం విడుదల అయింది. అంటే, నేటికి సరిగ్గా అర్ధశతాబ్దం అన్నమాట!....... ఈ సందర్భంగా ఆణిముత్యం వంటి ఆ కళాఖండం గురించి రెండుమాటలు చెప్పుకుందాం.

        "కాళిదాసు పాత్రకు నువ్వేం బాగుంటావు? రామారావు బాగుంటాడు" అన్నారు 'విజయా' చక్రపాణి.

        అక్కినేని నాగేశ్వరరావు వెంటనే ఏం మాట్లాడలేదు. ఆయన అలా అంటారన్న సంగతి ముందే తెలిసినట్టుగా "మీరలాగే అంటారు కానీ, నేను చేసి చూపిస్తాను చూడండి. కాళిదాసు గొప్ప కవి అయినంత మాత్రాన, గొప్ప పర్సనాల్టీ అవసరం లేదుకదా!" అంటూ, ఆ పాత్ర కోసం తాను చేస్తున్న కసరత్తుల గురించి చక్రపాణికి వివరించారు అక్కినేని.

        తనను ఎవరైనా తక్కువ అంచనా వేస్తే, తన విశ్వరూపం చూపిస్తారు అక్కినేని. ఆ జాబితాలో "మహాకవి కాళిదాసు" కూడా చేరుతుంది. మొదట్లో శుద్ధ అమాయకునిగానూ, మూర్ఖునిగానూ, వెఱ్ఱి వెంగళప్పగానూ కనిపిస్తూ, తదుపరి కాళికాదేవి అనుగ్రహంతో మహాకవిగా మారిన ' కాళిదాసు ' పాత్రను ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేశారాయన. ఆరంభంలోని కాలుని పాత్రకూ, ఆ పిమ్మట కాళిదాసు పాత్రకూ నటనలో హస్తిమశకాంతర తేడా కనిపిస్తుంది.

        ఆనాటి ప్రముఖ నటి శ్రీరంజని భర్త నాగమణి, నటుడు పి.సూరిబాబు కలిసి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. రచయిత పింగళి నాగేంద్రరావు, సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు, ఛాయాగ్రాహకుడు అన్నయ్య, కళాదర్శకుడు గోఖలే వంటి అతిరథ మహారథులు సమిష్టి కృషితో చెక్కిన చిత్ర శిల్పమిది.

        అప్పట్లో అక్కినేని పాతికవేలు పారితోషికం తీసుకునేవారు. ఎలాంటి ధనాపేక్ష, ఫలాపేక్ష లేకుండా నిర్మాతలు చేస్తున్న ఈ సత్కార్యానికి తనవంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో, సగం పారితోషికమే తీసుకున్నారాయన.


View Comments(2)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2