Type In Telugu
Article 881

Post an Article

స్త్రీ పాత్రలు పురుషులు ధరిస్తే
Prev Article
 
Next Article
 

User Rating : <None> Number Of Views : 106
Votes: 0  (Vote) Posted On 6/30/2010 @10:48:02 AM

        సినిమాలలో స్త్రీ పాత్రలు పురుషులు ధరించటం వల్ల హూ! ఏముంది? స్పందించేటంత అందంగా కూడా ఉంటాయా? ఓ రకంగా చెప్పాలంటే, కొన్ని పాత్రలు నవ్వు పుట్టించినా మరి కొందరి హావభావాలు అపహాస్యంగా ఉంటాయి. ఇంకా కొన్ని స్త్రీలను పరోక్షంగా గేలి చేస్తున్నట్టుగా ఉంటాయి. పైగా స్త్రీ వేష ధారణలో ఉన్నప్పుడు "కరాటేలు యుద్ధాలు కుస్తీపట్లు" మొదలు పెడితే చూడటానికి ముఖ్యంగా ఆడవారి అభిమానాన్ని ఘోరం గా హత్య చేస్తున్నట్టు ఉంటుంది. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఇంకా చెప్పాలంటే, ఆడ వేషం వేసుకుని హాస్య ధోరణిలో వివస్త్రలు కావడం లాంటి సీన్లు చూస్తుంటే "ఎందుకొచ్చిన సినిమాలు?" అనిపిస్తుంది.

        ఇక మగవారికి ఆడతనం అంటగడితే నాజూకుతనానికి బదులు నవ్వు పుట్టుకొస్తుంది. మోటు మోటు చేతులు, తెచ్చి పెట్టుకున్న వంపు సొంపులు మగ తనాన్ని దాచలేని చెంపలు, పైనుంచి కింది వరకు సిలిండరులా ఒంపులేక ఒంగని నడుము, మాటి మాటికి జారి పోతుందన్న భయంతో సవరించుకునే పైట ఊడి పోకుండా ఒడిసి పట్టుకునే చీర ఎటూ గాని గొంతు ఎందుకులేండి అందానికి అతకని విగ్గులు అచ్చం అదే "చూడు పిన్నమ్మ" లాగా ఉంటుంది మరి (తిట్ట కండేం).

        నిజానికా రోజుల్లో "స్త్రీ" పాత్రల్ని ఆకాశవాణిలో సైతం మగవారే నిర్వహించేవారట. రాను రాను నాగరికత వెఱ్రి ముదిరి స్త్రీ పురుషులిద్దరు పాత్రలు మార్చుకుంటున్నారు.

        ఇక అందచందాలు వేషభాషలు స్వేచ్చ సంస్కృతీ సాంప్రదాలు ఎలాటి వైనా మనిషి హృదయాన్ని సున్నితంగా తాకి ఒక్క క్షణం ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంటే అది పాత్రని బట్టి ఆకారం మారినా ఆకర్షణీయంగా రస రమ్యం గా హృదయాన్ని స్పందిస్తుంది. ఒక మధురమైన భావం, ఒక చక్కని నవ్వు, ఒక అందమైన దృశ్యం, ఒక మంచి మాట, హృదయాన్ని సున్నితంగా మీటి గుండె లోతుల్లో చిర కాలం మిగిలిపోతుంది. నిజం చెప్పాలంటే మగ వేషం స్త్రీలకి కొంచమైనా నప్పుతుందేమో గానీ స్త్రీ లాగ పురుషులు ఊ...హూ ..! అస్సలు మెప్పించలేరు. అందుకే అందమైన అపరంజి బొమ్మలా అమ్మాయి గానే పుట్టాలి అవతలి వారు అసూయతొ వేగి పోయేలా ! కాక పోతే సృష్టి కర్త స్వార్ధ పరుడు. ఆ స్వార్ధం తోనే కావచ్చును అసూయని కసిగా మార్చుకుని ఆడవారిని నంచుకుని తింటారు. అందుకే "జన్మంటూ ఉంటే మరు జన్మకైనా అమ్మాయిగా పుట్టాలని కోరుకుంటే" సరిపోతుంది కదా ?

View Comments(4)    Post a Comment    By - Rajeshwari Nedunuri