Type In Telugu
Article 910


కనుమరుగవుతున్న స్నేహ విలువలు... !   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1292
Votes: 2  (Vote) Posted On 8/15/2010 @7:26:01 AM

        "స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం....", "స్నేహ బంధమూ... ఎంత మధురమూ..." నిజమే ...! స్నేహానికి వున్న విలువ గొప్పదనం అలాంటిది.

        స్నేహాలు, స్నేహితులు ... జీవనయానంలో సహజమే... ! రైలు ప్రయణంలా సాగే సుదీర్ఘ జీవిత గమనంలో... ఎక్కే, దిగే ప్రయాణికుల్లా... ఎందరో తారసపడుతూ వుంటారు. వారిలో కొందరు కొంత దూరం వస్తే, మరికొందరు ఇంకొంత దూరం వస్తారు. ఏ ఒకరిద్దరు మాత్రమే చివరి మజిలీ వరకు రాగలరు. స్నేహం కూడా అంతే... కలిసిన ప్రతివారూ సుదీర్ఘ కాలం కలసివుండటం సాధ్యం కాదు. అలాగే ప్రతి పరిచయమూ స్నేహంగా మారక పోవచ్చు... !

        బాల్యంలో, చదువుకొనే సమయంలో, ఉద్యోగ సమయంలో... యెందరో తారసపడుతూ వుంటారు. వారంతా స్నేహితులుగా మారకపోవచ్చు. అయితే ఒకరో.. ఇద్దరో కంటిన్యూ కావచ్చు. పరిచయమైనవారు.. ఎక్కడో, ఎప్పుడో.. కలిసినప్పుడు .. " హలో..." అని పలకరించి అక్కడితో ఆగిపోతారు. నిజమైన స్నేహతులుగా మారిన వారు అప్పుడప్పుడూ కలుస్తూ... ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకొంటూ, కష్టసుఖాలలో పరస్పరం తోడుగా వుంటుంటారు. అలాంటి బంధమే.... అసలుసిసలైన స్నేహం... !

        అంతటి విలువైన స్నేహంలో రాను రాను విలువలు తరిగిపోతున్నాయోమోననిపిస్తుంది. నేడు .. స్నేహానికి స్వార్ధం, అవకాశవాదం... వచ్చి కల్తీ చేస్తున్నాయి. పరిశుద్ద స్నేహానికి ఇవి తూట్లు పొడుస్తున్నాయి. ప్రస్తుతం చాలా స్నేహాలు క్రింది ప్రాతిపదికన వుంటున్నాయంటే ఆశ్చర్యపోనక్కర లేదు.
  • అవతలి వ్యక్తి సంపన్నుడు.... యెప్పుడైనా వుపయోగపడతాడు.... !


  • అవతలి వ్యక్తి పలుకుబడి గలవాడు..... యెప్పుడైనా అవసరం రావచ్చు.


  • కలసి చదువుకొంటున్నాం .... కాబట్టి .. "హలో …హలో..." అని అంటే పోయేదేముంది.


  • ఒకే చోట వుద్యోగం చేస్తున్నాం.... తాత్కాలిక సర్దుబాట్లు, అందుబాట్లు.. వుంటాయి కాబట్టి, స్నేహంగా వుంటే పోయేదేముంది... !



View Comments(4)    Post a Comment    By - Audisesha Reddy Kypu
 
      1  2         Page