Type In Telugu
Article 911


వినదగు నెవ్వరు చెప్పిన ,,,, !
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1567
Votes: 1  (Vote) Posted On 8/20/2010 @12:16:04 AM

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ
        ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్దమో... తెలుకోవాలి. ఇది బద్దెన గారి సూక్తి. మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని... అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి ప్రయోజనం...! చెప్పుడు మాటలు విని శతృత్వం తెచ్చుకొంటే.. ఆ తర్వాత సర్దుకుపోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో బలమైన వ్యక్తులను ఢీ కొట్టాల్సివస్తే.. మొదటికే మోసం రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది.

        అసలు ఈ రోజుల్లో ఎదుటి వాడు చెప్పేది ఎంత మంది శ్రద్దగా వింటున్నారు.... ! వినే ఓపిక వుందా... ! విన్నా చెప్పింది ఎమిటో గ్రహించగలుతున్నారా... ! ఇతరులు చెప్పేది వినే ఓపిక , తీరికా ఎంత మందికున్నాయి... ! కొంతమంది ఇతరులు చెప్పేదాన్ని మొక్కుబడిగా వింటూవుంటారు. వారు చెప్పేది యేంటొ ఆలకించరు. ఎక్కడొ పరద్యానంగా వుండి.. వింటున్నట్లు తలూపుతూ నటిస్తుంటారు. ఇది చాలా తప్పు. నిజానికి చాలా మంది అలా శ్రద్దగా వినకపోవటం వల్లే చాలా అనర్ధాలు, అన్యాయాలు జరుగుతున్నాయి.

        అలా చక్కగా వినాలంటే.. ఖచ్చితంగా .. కొన్ని పద్దతులు అలవరచుకోవాలి. మొట్ట మొదట చక్కగా వినాలంటే ... వారిలో మానసిక క్రమశిక్షణ వుండాలి . వినే సమయంలో.. ఆవేశలకు తావివ్వరాదు. యెంతో ప్రశాంతంగా వినాలి. చెప్పే వారికి మద్యలో అడ్డుపడకుండా ఆసాంతం వినాలి. అప్పుడే వారు విషయాన్ని సవివరంగా చెప్పగలరు. వారి అభిప్రాయలను .. పూర్తిగా వినకుండా యే నిర్ణయాన్నీ తీసుకోకూడదు. వినటం కూడా ఓ కళ. ఎవరైతే చక్కగా వినగలుగుతారో.. వారు ఖచ్చితంగా జ్ఞానులు అవుతారు. జ్ఞాన సముపార్జనా ప్రక్రియలలో శ్రవణానిదే.. ప్రధమ స్థానం. పాఠశాలలో విద్యార్ధులకు కూడా అభ్యస ప్రక్రియలో భాగంగా మొదట శ్రవణానికే ప్రాధాన్యత. శ్రవణం తర్వాత భాషణం. అంటే భాషణానికి అవసరమైన జ్ఞానం శ్రవణం ద్వారానే లభిస్తుంది.

        అంటే చక్కటి జ్ఞానానికి మార్గం శ్రద్దగా వినటం. పూర్వం విద్యలన్నీ దాదాపుగా విని నేర్చుకున్నవే.. ! నాడు నోట్ పుస్తకాలు ఎక్కడవి. గురువులు చెప్పేటప్పుడు శ్రద్దగా విని, దానిని మనసులో వుంచుకొని జ్ఞానాన్ని గ్రహించేవారు. అభిమన్యుడు తల్లి కడుపులో వుండి పద్మవ్యూహం లాంటి విద్యలను విని నేర్చుకొన్నాడని మనం భారత కథలో విన్నాం కదా.. !

        పెద్దల సందేశాలను, స్నేహితుల హితవచనాలను సమగ్రంగా విని, కూలంకషంగా అర్ధం చేసుకొని, ఆ తర్వాత తగు నిర్ణయాలు తీసుకొన్నవారు ఖచ్చితంగా జీవితాన్ని మంచిమార్గంలో నడిపించుకోగలరు. అలాగే అధికారులు కూడా తమ క్రింది ఉద్యోగులు చెప్పేదానిని శ్రద్దగ విని, అందులోని వాస్తవాలను పరిశీలించి... నిర్ణయాలు తీసుకొంటే... ఉత్తమ అధికారులుగా కీర్తించ బడతారు. లేకుంటే నలుగురులో వెలితిపడి.... ఒంటరి వారిగా మిగిలి పోతారు.

View Comments(6)    Post a Comment    By - Audisesha Reddy Kypu