Type In Telugu
Article 933


ఏమయ్యిందంటే...   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1430
Votes: 2  (Vote) Posted On 10/2/2010 @3:46:11 AM

        ఈ రోజు గాంధీజయంతి... అయినా ఆఫీస్ వర్కింగ్ డే నాకు. సో నత్తలతో పోటీ పడుతూ 158 బోరబండ బస్ ఎక్కాను. ఫుల్ రష్ ఉంది. సీనియర్ సిటిజన్స్ తో మొదటి 4 వరసల సీట్సూ నిండిపోయాయి...ఒక్కసారిగా తెల్లకలువలు వికశించాయా అన్నట్లు... "గాంధీ జయంతి కదా పేరుమోసిన వృద్ధులందరికీ ఏదైనా అభినందన సభ ఉందేమో..." అనుకొన్నాను. రెండవ వరసలో విండో సీట్ లో కూర్చొన్న వ్యక్తి ముందుకు వంగిపోయి నిదురపోతున్నారు. "పాపం ఈ వయసులో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా ఇంత ఎండలో ఈ పయనమెచటికో..." అనుకొంటున్నాను.

        ఈ లోపు మెడ నొప్పి పుట్టిందేమో ఆయన నిదుర మేల్కొని వెనక్కి వాలారు మళ్ళీ నిదురమ్మ ఒళ్ళోకి మెల్లగా జారిపోతూ..... పసిమి ఛాయ, వార్ధక్యం తెచ్చిన ముడతలు లీలగా కనిపిస్తున్నాయి (బహుశా హెల్త్ కేర్ ఎక్కువేమో...) అనుభవజ్ఞతకు ఆలవాలమైనట్లున్న అక్కడడక్కడ మాత్రమే తొంగి చూస్తున్న నెరసిన వెంట్రుకలు... "ఈయన్ని ఎక్కడో చూశాను....ఎక్కడబ్బా..." అనుకొంటూ... మోకాలిని తడితే గుర్తు తెలిసింది... ఆయన మూవీ ఆర్టిస్ట్ "శ్రీ కాకరాల " అని. పలకరించాలా.... వద్దా.... ఒకవేళ నా పీత బ్రెయిను భ్రమపడిందేమో అనే బిడియం... అసలే నాకు పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడాలంటే గొంతులో తడి ఆరిపోతుంది... బట్ ఆయన కాస్త పేరున్న ఆర్టిస్ట్... మాట్లాడ్డంలో తప్పులేదు... అయినా ఏమో... ఈయనని అడుగుదాం అనుకొంటూ... శ్రీరాం కి కాల్ చేసి చెప్పాను... "భయమేముంది సెలబ్రిటీ తో మాట్లాడితే... ఒకవేళ ఆయన కాకపోతే పెద్దవారు ఆశ్శీసులిస్తారు తప్ప తిట్టరు కదా !" అన్నారు. అయినా ధైర్యం చాల్లేదు..

        ఆబిడ్స్ దాటింది బస్. ఈ లోపు ఆయన నిద్ర నుంచి పూర్తిగా మేల్కొని చేతిలో ఉన్న న్యాప్కిన్ తో మొహం తుడుచుకొన్నారు. పక్కనే నిలబడ్డ ఆడవాళ్ళందరినీ చూసి నిట్టూర్చారు.

        అప్పుడు "నమస్తే సర్" అన్నాను.

        "నమస్తే అమ్మా! నేను మిమ్మల్ని గుర్తు పట్టలేదు. ఎవరమ్మా మీరు?" అన్నారు.


View Comments(7)    Post a Comment    By - Padma Sreeram Vangara
 
      1  2  3         Page