Type In Telugu
Article 939


ఆదిశంకరులు ఐదు అశ్రుకణాలు   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1836
Votes: 3  (Vote) Posted On 10/15/2010 @12:43:28 AM

        "శంకరశ్శంకరస్సాక్షాత్" అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి.

        కేరళదేశంలోని కాలడి (టి)లో శివగురుడు, ఆర్యాంబ అనే పుణ్యదంపతులకు పరమేశ్వర ప్రసాదంగా ఆదిశంకరులు జన్మించారు. ఆయనకు 5 సంవత్సరాల వయస్సులో తండ్రి గతించారు. తల్లి ఆర్యాంబయే ఆయనకు తమ జ్ఞాతులచే ఉపనయన సంస్కారం జరిపించి, వేదాధ్యయనం చేయటానికి గురువుల వద్ద చేర్చింది. ఆయన బ్రహ్మచారిగా సకల శాస్త్రాలూ ఏకసంథాగ్రాహిగా అభ్యసిస్తున్నరోజుల్లోనే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక పేదరాలి దారిద్ర్యాన్ని చూచి చలించిపోయిన శంకరులు "కనకధారాస్తోత్రం" చెప్పి ఆమె యింట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు.

        కాలక్రమంలో ఆయన సన్యాసం స్వీకరించాలని సంకల్పించారు. ఏ వ్యక్తి అయినా సన్యాసం స్వీకరించాలంటే – తప్పనిసరిగా తన తల్లి అనుమతి తీసుకోవాలి. అంతేకాదు సన్యాసికి – అతని తండ్రి యైనా నమస్కరించాలి ! సన్యసించి ఎంతటి గురుపీఠాన్ని అధిరోహించిన యతియైనా - తల్లికి మాత్రం నమస్కరించాలి. ఇది భారతీయ సంస్కృతి మాతృదేవతకు ఇచ్చిన ప్రాధాన్యం.

        శంకరులు తమ మాతృమూర్తివద్దకు వెళ్ళి "అమ్మా ! త్యాగంతోనే ఎవరికైనా అమృతత్వం లభిస్తుంది. కర్మలతోనో, సంతానంతోనో అది సాధ్యంకాదు. సన్యాసం స్వీకరించి అమృతత్వాన్ని పొందగలిగే వరం నాకు ప్రసాదించు" అని అడిగారు. ఈమాట వినగానే ఆర్యాంబ నిర్ఘాంతపోయి "నాయనా ! నేను వృద్ధురాలి నయ్యాను. నేను బ్రతికి ఉన్నన్ని రోజులూ నన్ను కనిపెట్టుకొని ఉంటావనుకుంటే, నువ్వు సన్యసించి నన్ను వదలిపోవాలనుకోవటం న్యాయమేనా ?" అని విలపించింది. ఆమె దుఃఖాన్ని అర్ధంచేసుకున్న శంకరులు – ఆమె అనుమతి లభించినపుడే సన్యాసం స్వీకరించాలని భావించి ఆమెను అనునయించి యథాప్రకారంగా మాతృసేవలో నిమగ్నులయ్యారు.

        ఒకసారి ఆర్యాంబకు ఒక కల వచ్చింది. తాను, శంకరుడూ పూర్ణానదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. తాను గట్టుకు దగ్గరగా ఉంది. శంకరుడు నదిలో కొంతదూరం వెళ్ళాడు. ఒక మొసలి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బలంగా లోనికి లాగుతోంది. తాను నిస్సహాయురాలై ఏమీ చేయలేకపోతోంది.


View Comments(10)    Post a Comment    By - Ramakrishna Murty
 
      1  2  3  4         Page