Type In Telugu
Article 940


143 సారీ రాంగ్ నంబర్   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1538
Votes: 2  (Vote) Posted On 10/16/2010 @11:16:38 AM

        లేచింది నిద్రలేచింది మహిళా లోకం దద్ధరిల్లింది...

        వాళ్ళు లేస్తే లేచారు మమ్మల్ని నిద్రపోనివ్వారా అనుకుంటూ టైము చూస్తే కాలేజీ కి లేటుగా వెళ్ళే టైమైంది. పక్కింటి పంకజాక్షి గారు పాటలు పెట్టుకుని డాబా మీద వాకింగ్ చేస్తున్నారు. నాకు రోజూ అలార్మ్ ఆమే. మరి ఊర్లో అంటే కోడికూసేది (ఇప్పుడు కోసే కోళ్ళు తప్ప కూసే కోళ్ళు లేవనుకోండి). వెంటనే బయలుదేరి బండి మీద కాలేజి బాట పట్టాను. అలా మెయిన్ రోడ్ ఎక్కానో లేదో కొంచెం దూరంలో చెట్టు కింద ఒక అమ్మాయి లిఫ్ట్ కావాలి అన్నట్టుగా చెయ్యి ఊపుతోంది. నాకు తెలియకుండానే బండి అక్కడ ఆగిపోయింది.

        "కాలేజి కి టైం అవుతుంది కొంచెం లిఫ్ట్ ఇస్తారా" అని అడిగింది.

        సరే అన్నట్టు తలూపాను.

        ఆమె అలా ఎక్కుతుండగా ఒక్కసారిగా తలమీద ఎవరో రాడ్ తో కొట్టినట్లనిపించింది. కళ్లు తెరచి చూస్తే "ఆఁ... స్టాపొచ్చింది దిగండి దిగండీ" అంటున్నాడు కండక్టర్. ఛా! కలని క్లాస్లో కంటిన్యు చేద్దామనుకుని బస్ దిగి కాలేజ్ కి వెళ్లాను...

        అప్పటికే అప్పారావ్ మాష్టారి క్లాస్ అయిపోయింది. మళ్లీ ఈయన చేతిలో చివాట్లు తప్పవురా అనుకుంటూ లాస్ట్ బెంచ్ వైపు నడిచాను. క్లాస్ సీరియస్ గా జరుగుతోంది. వెనుక మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం. ఇంతలో లంచ్ బ్రేక్ రానే వచ్చింది.

        భోజనం చేస్తుండగా కుమార్ గాడు అన్నాడు "అరేయ్! ఆ ప్రవీణ్ గాడు ఎక్కువ చేస్తున్నాడు, వాడికి డోస్ పడాల్సిందే" అని.

        "ఏంట్రా ఏమైంది అని" నేను అడిగేలోపే గుంపులో ఇంకొకడు అడిగేసాడు.


View Comments(13)    Post a Comment    By - Raa
 
      1  2  3         Page