Type In Telugu
Article 945


ప్రేమను పంచండి ..! పొందండి ..!   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1650
Votes: 4  (Vote) Posted On 10/24/2010 @7:33:20 AM

        " అమ్మా ..! నాన్న యింకా రాలేదా ..? " హోం వర్క్ పూర్తి చేసుకొని పడుకోబోతూ అడిగాడు అనిల్.

        " యింకా రాలేదు చిన్నా .. ! నువ్వెళ్ళి పడుకో .... ! " చెప్పింది తల్లి.

        " నాన్న వచ్చిందాకా మేలుకొని వుంటానమ్మా .... ! నాన్నతో మాట్లాడి రెండు రోజులైంది. నిన్న కూడా నాన్న వచ్చేసరికి నిద్రపోయాను. పొద్దున నేను స్కూల్ కి వేళ్ళే వరకు నాన్న నిద్ర లేవ లేదు. " చెప్పాడు అనిల్.

        " సరే... ! " అంది.

        కాని మరో అర గంట వరకు చూసిన అనిల్ ఆ తర్వాత నిద్రకి వుండలేక అలానే సోఫాలో నిద్ర పోయాడు. తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి .. దుప్పటి కప్పింది.

        ఆ తర్వాత యెప్పుడో ఇంటికి చేరాడు రవి. రవికి పని తక్కువ, పెత్తనాలు యెక్కువ. సాయంత్రం ఐయిదింటికే ఆఫీసు నుండి బయటపడి నేరుగా ఇంటికి వచ్చే రకం కాదు. దారిలో లెక్కలేనన్ని పిచ్చాపాటి వ్యవహారాలు. ఒక్కటీ ఉపయోగం లేనివి. పిల్లలూ పెళ్ళాం గుర్తుకు రాదు.

        ఇది ఒక్క అనిల్ ప్రాబ్లం కాదు. పిల్లలందరికీ సాయంత్రం అయ్యేసరికి అమ్మానాన్నలతో కలసి కబుర్లు చెప్పుకొంటూ ఎంజాయ్ చేయాలనే కోరిక వుంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకూ స్కూల్లో పాఠాలు, హోం వర్క్ లతో విసిగిన ఆ పసి హృదయాలు ఆ మాత్రం రిలాక్స్ కోరుకోవటం సహజం. అయితే- వారి మనసుని ఎందరు అర్ధం చేసుకోగలుగుతున్నారు? ఆ కొద్ది సమయాన్ని ఎందరు వారితో పంచుకొని ఎంజాయ్ చేయగలుతున్నారు...? ఇది .. ప్రతి తల్లీ తండ్రీ తెలుసు కోవాల్సిన అంశం.

        ఇది పిల్లల మధ్య, పెద్దల మధ్య అంతరాలను పెంచి .. పరిస్థితులను యెక్కడకో తీసుకు పోయే వీలుంది. నాన్న తనతో కబుర్లు చెప్పడం లేదనే భావం పిల్లలలో కలిగితే ... క్రమంగా నాన్న అంటే ద్వేషం పెరిగే వీలుంది.


View Comments(6)    Post a Comment    By - Audisesha Reddy Kypu
 
      1  2  3         Page