Type In Telugu
Article 946


ఉపవాసం మంచిదే .... !   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1268
Votes: 1  (Vote) Posted On 11/6/2010 @2:44:58 AM

        "లంఖణం పరమౌషధం" అని పెద్దలు ఏనాడో చెప్పారు. ఎన్నో రకాల జబ్బులకు... అజీర్తే మూల కారణమని వారి నమ్మకం. నిరంతర ప్రక్రియ అయిన జీర్ణ వ్యవస్థకు రెస్ట్ వుంటే మంచిదే... ! ఈ ఉపవాస ప్రాముఖ్యతను గుర్తించిన మన పెద్దలు ... దీనిని ఆధ్యాత్మిక చింతనకు ముడివేశారనడం అతిశయోక్తి కాదేమో.... !

        ఉపవాసం పేరుతో ఇప్పుడూ చాలమంది వారానికి ఒక రోజో లేదా ఒకపూటో ... ఆహారం తీసుకోవటం మానేస్తున్నారు. ఈ ఉపవాసాన్ని కొన్ని పండుగలలో కూడా ఆచరిస్తూ వుంటారు. చాలా ఇళ్ళలో ముఖ్యంగా మహిళలు భక్తితో ఉపవాసాలు చేస్తుంటారు. అలా ఉపవాసం వుండి .. భగవంతుని ప్రార్ధిస్తే... శుభాలు కలుగుతాయనే నమ్మకం. పుణ్యం సంగతి దేవుడెరుగు ... దీని వలన ఆరోగ్యానికి మేలు జరుతుందనేది వాస్తవం. ఇప్పుడంటే .. స్త్రీలు కూడా ఉద్యోగాల కొరకు బయటకు వెళుతున్నారు. పూర్వ రోజుల్లో అధిక శాతం మంది ఇంటిపట్టునే వుండే వారు. వారికి తగినంత వ్యాయామం లేక స్థూలకాయులుగా అయ్యేవారు. అలాంటి వారికి ఈ ఉపవాసం మంచిది.

        వారమంతా కంటికి కనిపించిందలా పీకల దాకా మెక్కి ... ఆ తర్వాత ఒకరోజు ఉపవాసం వుంటే యేదో మంచి జరుగుతుందను కోవడం పొరపాటు. ప్రతిరోజూ పద్దతిగా మితాహారం తీసుకొనేవారు ఉపవాసం చేయనక్కర లేదు.

        ఈ రోజుల్లో ... యువత ముఖ్యంగా అమ్మాయిలు శరీరం లావు కాకుండా నాజూగ్గ వుండడానికి డైటింగ్ పేరుతో .. ఆహారం తగ్గించడం మనం గమనిస్తూ వున్నాము. చక్కటి ఆరోగ్యాన్ని… శరీరాకృతిని కోరుకోవటం మంచిదే. దాని కోసం ఉపవాసం కూడా మంచిదే... ! అయితే కొన్ని నియమాలు, జాగ్రత్తలు తీసుకోవడం వలన మరింత మేలును పొందే అవకాశం వుంది.


View Comments(2)    Post a Comment    By - Audisesha Reddy Kypu
 
      1  2  3         Page