Type In Telugu
Article 947


మహాత్ముల స్వభావం   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : <None> Number Of Views : 1039
Votes: 0  (Vote) Posted On 11/6/2010 @2:52:35 AM
"విత్తే త్యాగం, క్షమా శక్తౌ ,దుఃఖే దైన్యవిహీనతా
నిర్దంభతా సదాచారే - స్వభావోయం మహాత్మనామ్."
        ధనం ఎక్కువగా ఉంటే త్యాగ గుణం, శక్తి ఉంటే క్షమాగుణం, దుఃఖసమయంలో దైన్యంలేకుండా ఉండటం, ఆచారాలను పాటించటంలో మార్మికత లేకుండా ఉండటం మహాత్ముల స్వభావం. అని ఈశ్లోకానికి అర్ఠం.

        విత్తే త్యాగమ్..

        నిజానికి సామాన్యంగా ధనంతో పాటు గర్వం, స్వార్థం, పిసినారితనం, ఇంకా సంపాదించాలనే తపన, అందుకోసం చేయరాని పనులు చేయటం మొదలైన లక్షణాలు చాలామందికి వస్తాయి. కానీ ధనాన్ని త్యాగం చేయటం మహాత్ములకే సాధ్యం. కాళిదాసు రఘుంశ రాజుల లక్షణాలను చెపుతూ "త్యాగాయ సంభృతార్థానామ్" అన్నాడు. ఆ రాజులు ధనాన్ని కూడబెట్టటం త్యాగం చేయటానికేనట! ధనికులు దీనిని గుర్తించాలి. సమాజంలోని అసమానతలను తగ్గించి, అలజడులను నివారించటంలో ధనికులు తమ త్యాగగుణంతో సహకరించాలి.

        క్షమా శక్తౌ ..

        శక్తిగల వారు క్షమాగుణం కలిగి ఉండాలి. శక్తి అంటే శారీరక శక్తి కావచ్చు, అధికార శక్తి కావచ్చు. స్వవర్గ శక్తి కావచ్చు. లోకంలో ఎక్కువగా జరిగేది ఏమిటంటే – శారీరక శక్తిగలవారు శక్తిలేనివారిపై విరుచుకు పడతారు. తమ బలాన్ని నిరూపించుకునే అవకాశంకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరైనా వారి అవసరార్థం తమబలాన్ని వాడుకోవాలనుకుంటే, కొందరు నిస్సంకోచంగా నాలుగు రూకలకోసం అమ్ముడు పోతారు. తమశక్తి దుష్కృత్యాలకు వినియోగింపబడుతోందన్న స్పృహ వారికి ఉండదు. క్షమ అంటే సహనం, నిగ్రహం . శక్తిని సద్వియోగం చేసుకోవటంలో ఔన్నత్యం ఉంది. అధికార శక్తి ఉన్నవారు ఓర్పుతో ఇతరులకు మేలుచేసే ధోరణి కలిగి ఉండాలి. అసలు ముందు, సహాయార్థియై వచ్చినవాడి గోడు వినాలి. కానీ ఈనాడు ఎంతమంది అధికారులకు ప్రజల మొరలు వినే కోరిక, తీరిక ఉన్నాయి? మరికొందరు తమకు శక్తి లేకపోయినా, తమ ప్రయోజనాలకోసం తమవర్గం వారిని రెచ్చగొట్టి అకారణద్వేషాలు పెంచుతారు. అదృష్టవశాన సంక్రమించిన శక్తిని నియంత్రణలో ఉంచుకొని లోకహితార్థం వినియోగించినవాడు ధన్యుడు.


View Comments(5)    Post a Comment    By - Ramakrishna Murty
 
      1  2         Page