Type In Telugu
Article 956


గిరీశం వెర్సెస్ తెలంగాణా (జస్ట్ ఫర్ ఫన్)   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1483
Votes: 2  (Vote) Posted On 1/12/2011 @8:01:41 AM


        ప్రత్యేక తెలంగాణా డిమాండ్ హద్దులు దాటడంతో ఇహ ఇది పని కాదని సిదమ్బరయ్య కిట్టుడి కవిటీ ఎట్టాక గిరీశానికో పేద్ద థాటొచ్చిన్ది. మనవాళ్ళు ఉత్త చవటాయులని వాల్రెడీ వెంకటేశానికి డిక్లేరు చేసేసాను కాబట్టి నేనే ఓ కఁవిటీ ఏస్తే పోలా....అనుకొన్నాడు రింగులు రింగులుగా చుట్ట పొగ వదులుతూ....వేంటనే వెంకటేశానికి కవురెట్టాడు. తూనీగలా ఎగురుకుంటూ వచ్చేశాడు వెంకటేశమ్. "గురువుగారూ ! హేవిటి ఆనతి" అంటూ...

        "అదేనోయి వేంకటేశమ్! ఆ కిట్టీ కమిటీ తేల్చేదేమున్ది లే గానీ మనఁవే ఓ కవిఁటీ ఏద్దామని నాకు పేద్ద ఆలోచనొచ్చిన్దోయ్" అన్నాడు ఆ గోడ ఈ గోడ బల్లికోసమ్ వెతికేస్తూ.

        "అలాగే గురువుగారూ... మీకా ఆలోచన రావడమే రాహులు గాంధీ అదృష్ట్మనుకోండి" అన్నాడు వెంకటేశం నిన్నా మొన్నా టీ వీ లో చూసిన పేరు నెమరేసేస్తూ.

        "వెరీ గుడ్ వెంకటేశం అందుకే నువ్వంటే నాకిష్టమ్. ఇట్టా చెపితే అట్టా అల్లేస్తావ్. అందుకే నిన్నే కమిటీ అధ్యక్షుణ్ణి చేద్దామనుకొంటున్నాను" అన్నాడు పేద్ద దీర్ఘాలోచనలోకి వెళ్ళనా వద్దా అన్నట్లు ఫేసు పెడుతూ....

        "గురువుగారూ ! అంత పెద్ద బాధ్యత నా భుజాలపై పెడుతున్నారా??" అన్నాడు వెంకటేశం ఆనందం దాచుకోడానికి ప్రయత్నిస్తూ... ఆ బరువు అప్పుడే మోసేస్తున్నట్లు భుజాలు వంగదీస్తూ...

        "తప్పదోయ్... నాకా దేశంలో పూటకూళ్ళమ్మలూ, యన్గ్ విడోస్ లూ ఈ బాధ్యతలే సరిపోతాయి. శివరాకరుగా మీ రిపోర్ట్ చూసి నే అల్టిమేట్ రిపోర్ట్ రడీ చేస్తాను. సరేనా?" అన్నాడు గిరీశమ్ ఆరిన చుట్ట పారేస్తూ జేబులో లేని ఇంకో చుట్టకోసం వెతికేస్తూ....

        గురువుగారి అవసరాలన్నీ అర్థమ్ చేసుకోగలిగిన ఏకలవ్య శిష్యుడైన వెంకటేశం తన పురాతన బొందు నిక్కరు జేబీలో దాచిన సుట్టల కట్ట తీసి గురువుగారి చేతిలో పెట్టాడు. రెన్డున్నరో చుట్ట తిసి వెలిగిస్తూ "అవునూ మిష్టర్ వెంకటేశమ్! మిగతా సభ్యులుగా ఎవర్నెడదామన్టావ్?" అన్నాడు పొట్టి వెంకటేశానికి బుట్టెడు పెద్దరికాన్నిస్తూ.

        "దాందేముంది గురువుగారూ మన పెద్దలు లుభ్దావధానులు గారూ, రామప్పంతులు గారూ ఇంకా..." అన్నాడు బుర్ర గోక్కుంటూ.

        "ఠాట్ లుబ్ధావధాన్లూ, అగ్నిహోత్రావధాన్లూ పనికి రారోయ్. మన మధురవాణీ , రామప్పంతులు, ఆ బైరాగీ, నువ్వూ చాలు. మిగతావన్నీ నే చూసుకుంటాను" అని లాల్చీకి సెంటు కొట్టుకొని మధురవాణింటికి బయల్దేరాడు అవర్ గ్రేట్ గిరీశం.


View Comments(9)    Post a Comment    By - Padma Sreeram Vangara
 
      1  2  3  4         Page