Type In Telugu
Article 962


నల్ల రామాయణము - తెల్ల రామాయణము   (Page 1 Of 3)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1778
Votes: 9  (Vote) Posted On 2/5/2011 @10:34:04 AM

        మన తెలుగులోని ప్రధానకావ్యాలైన భారత, భాగవత, రామాయణాలు ఏవీ ఒకేచేతి మీదుగా వచ్చినవి కావు. భారతమును కవిత్రయం రచిస్తే, భాగవతమును పోతన, ఆ పిమ్మట శిథిలమైన భాగముల ఫూరణను వెలిగందల నారయ, ఏల్చూరి సింగన కావించారు. ఇక, "భాస్కర రామాయణము" ను భాస్కరునితో పాటు కుమార రుద్రదేవుడు, మల్లికార్జున భట్టు, అయ్యలార్యుడు వ్రాశారు.

        తెలుగురామాయణాల్లో గోన బుద్ధారెడ్డి విరచించిన "రంగనాథ రామాయణము" అన్నిటికన్నా ప్రాచీనం! ఐతే, ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో వ్రాయబడింది. కవయిత్రి మొల్ల వెలయించిన "మొల్ల రామాయణము" బాగా సంక్షిప్తంగా ఉంటుంది. అందువల్ల, సాహితీప్రపంచములో "భాస్కర రామాయణమే" భక్తిగా సంభావింపబడుతున్నది.

        "భాస్కర రామాయణము" లోని కిష్కింధాకాండము మల్లికార్జునభట్టు ప్రణీతము! వాలి వధ జరిగిన తర్వాత, వర్షాకాలం వచ్చిన సందర్భములోని ఒక పద్యమును అవలోకిద్దాం.

        మొదట ఆ పద్యాన్ని చిత్తగించండి.
యమునద్గంగము, కృష్ణభూమదిల, మబ్జాక్ష న్మనుష్యంబు, నీ
ల మహీధ్రన్నిఖిలాచలావళి, తమాలద్భూజ, మిందీవర
త్కుముదశ్రేణి, పికద్విహంగము, దమస్తోమద్గ్రహోర్క ప్రభా
సముదాయం బగుచుండె లోక మలఘు శ్యామాభ్రముల్ బర్వినన్.
        ఇప్పుడు పద్యభావమును పరిశీలిద్దాము.
వర్షారంభ సూచనగా ఆకాశం అంతా దట్టంగా నల్లని మేఘాలు
కమ్ముకున్నాయి. సందులేకుండా, గగనతలం నిండుగా కరిమబ్బులు
ఆక్రమించాయి. లోకమంతా ఆ మబ్బుల వల్ల చీకటైపోయింది. ప్రకృతిలోని
ప్రతి వస్తువు పైనా నీలినీడలు కమ్మి, వాటి రూపురేఖలూ, స్వభావాలూ
పూర్తిగా మారిపోయినట్లుగాఅనిపించింది.



View Comments(7)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2  3         Page