Type In Telugu
Article 963


ప్లానింగ్ తప్పనిసరి....!   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1456
Votes: 1  (Vote) Posted On 2/6/2011 @12:27:14 AM

        "రవి డిగ్రీలో చేరనంటున్నాడండీ...! ఇంజినీరింగ్ చేయాలని మొండిపట్టుగా వున్నాడు..." పడుకోబోయే ముందు భర్తతో చెప్పింది సరళ.

        "ఇంజనీరింగ్ అంటే మాటలా ఎక్కువ మొత్తాలలో ఫీజులుంటాయి... ! వాడికొచ్చిన ర్యాంకుకి మంచి కాలేజీలో సీట్ రావటం కష్టం..." చెప్పాడు రామా రావు.

        "మేనేజ్ మెంట్ కోటాలోనైనా చేర్పించమంటున్నాడండీ... !"

        "మేనేజ్ మెంట్ కోటాలోనా ... ! లక్షల్లో పోయాలి... నావల్ల కాదు..." అని తెగేసి చేప్పాడు.

***        ***        ***        ***

        " మన రాజాకి ర్యాంక్ తగ్గిందట... ! మంచి కాలేజీలో సీటు రాదేమోనని దిగులు పడి పోతున్నాడు. మీరైనా ధైర్యం చెప్పండి... !" సాయంత్రం ఇంటికొచ్చిన భర్తతో అంది రజిత.

        " వాడికి ఏ కాలేజెలో సీటు కావాలో అడుగు ... అక్కడే చేర్పిద్దాం. ర్యాంక్ రాకపోతే... మేనేజ్ మెంట్ సీట్ లో చేర్పిద్దాం... ! "అని భరోసా ఇచ్చాడు సుబ్బారావు.

***        ***        ***        ***

         ఇక్కడ ఒక విషయం గమనించాలి..!. ఇద్దరిదీ ఒకటె జాబ్. దాదాపుగా ఇద్దరికీ ఒకే జీతం. అయితే …. సుబ్బారావు., రామారావు లాగా మనీ కోసం హైరానా పడలేదు. తన కుమారుడిని చక్కగా ఒక ఇంజినీరింగ్ కాలేజిలో చేర్పించాడు. మరి.... రామారావు చేయలేని దానిని సుబ్బారావు యెలా చేశాడు... ! రామారావు ఎందుకు చేయలేక పోయాడు... దీనికి కారణం ఒకటే.... రామా రావుకి సరైన ప్లానింగ్ లేకపోవటమే.... ! మొదటి నుండి పిల్లల చదువుల పట్ల సరయిన ప్లానింగ్ వుంది కాబట్టే సుబ్బరావు యెలాంటి ఇబ్బందులు పడలేదు. ఎదిగే పిల్లలకు ఎప్పుడు యే అవసరాలు వస్తాయో గమనించుకొని, తదనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటే యే ఇబ్బందీ వుండదు.

        నేటి పోటీ ప్రపంచం లో చదువులు కొనాల్సిన పరిస్తిలు ఎర్పడ్డాయి. కార్పొరేట్ సంస్థల ఆకర్షణలో పడిన విధ్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడ చదివించడానికి యెంతకైనా సిద్దపడుతున్నారు. కాలేజి స్థాయిలోకి వచ్చేసరికి ... చదువు ' కొనా ' లంటే... లక్షలు పోయాల్సిన పరిస్థితి వచ్చింది.


View Comments(1)    Post a Comment    By - Audisesha Reddy Kypu
 
      1  2         Page