Type In Telugu
Article 971


కాముని పున్నమి
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1398
Votes: 2  (Vote) Posted On 3/18/2011 @12:41:13 AM

        మనకి ప్రతి సంవత్సరం పాల్గుణ పూర్ణిమ తిధి నాడు వస్తుంది. దీన్ని "కాముని పున్నమి" అనీ, "కామ దహన" మనీ, "వసంతోత్సవ మనీ "," హోలీ పండుగ" అనీ పిలుస్తారు .ఉత్తర భారతీయులు " హోలీ " వ్యహరిస్తారు.దీన్నే రక్షా బంధనమని కూడా అంటారు.

        ఐతే వీటి వెనుక అనేక పురాణ కధలూ దాగి ఉన్నాయి. "కామానికి" అది దేవుడు మన్మధుడు. అంటే మనస్సును చిలికే వాడు, మదించే వాడు, మనస్సుని కల్లోల పరచేవాడు అని అనేక అర్ధాలు ఉన్నాయి. అటువంటి మన్మధుడు, రతీ దేవితో చేరి పార్వతీపరమేశ్వరులనూ కల్లోల పరచ బోయి త్రినేత్రుడి ఆగ్రహానికి గురియై త్రినేత్రాగ్ని లొ పడి భస్మం అయ్యాడు. అందు వలన ఆరోజు "కాముని పున్నమి" అంటారు .

        ఇక పొతే "వసంతిక" అనే మహా భక్తురాలు అందగాడైన భర్త వ్యామోహం లొ పడి, శివారాధనకి దూరమైంది. అందువలన పార్వతీదేవి ఆగ్రహానికి గురియై అగ్నిప్రవేశం చేసింది. అందుకు ఆ భక్తురాలి భక్తికి సంతసించి పార్వతీదేవి ఆమె చితిని పూల పానుపుగా మార్చి, "అమ్మా! వసంతికా! వసంతంతో సమానమైన యవ్వనాన్ని, అందగాడైన నీ భర్తనీ, లక్ష్య పెట్టక తుచ్చమైన కామాన్ని అగ్నికి ఆహుతి చేసావు గనుక ఈ రోజు "పాల్గుణ పౌర్ణిమ" , ఇంతటి పవిత్ర మైన రోజు కావున, నీ త్యాగనిరతికి సంతసించి ఈ రోజు నీ పేరున "వసంతోత్సవంగా ప్రసిద్ధమౌతుంది" అని దీవించి, అదృశ్యమయ్యింది..

        ఇక నిజానికీ ఈ పండుగ "హోలీ" కాదు. దీన్ని "డోలీ" గా గుర్తించాలి . అదెలా ? అంటే "హోలిక" అనే రాక్షసీ పూర్వం కృత యుగంలో, "రఘునాధుడు" అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యం లొ ఆ రాక్షసి కేవలం శిశువులను మాత్రమే హతమారుస్తూ ఉండేదట. అందువలన ఆ రాజు ఆ హోలిక అనే రాక్షసిని సంహరించాలని ప్రయత్నించగా దేవఋషి నారదుడు అడ్డుబడి, "స్త్రీని సంహరించడం రాజ లక్షణం కాదని," వారించి కేవలం ఆమెని శాంతింప జేయడం కోసం ప్రతి సంవత్సరం, "పాల్గుణ పూర్ణిమ" నాడు, "హోలికకు" వర్ణ జలోత్సవం ( రంగు రంగుల నీటితో ) చేయాలని ఆదేశించాడు. అందువలన శిశు మరణాలు సమసిపోయాయి. ( ఈ వృత్తాంతాన్ని ధర్మ రాజు శ్రీ కృష్ణునికి చెప్పి నట్టుగా భవిషత్ పురాణములో పేర్కొన బడినది) ఇంతకీ ఈ "హోలిక" హిరణ్యకశిపునకు సోదరి.

         ఈ హోలికనే "డోలికా" ఉత్సవ మని పేర్కొన బడినది. అందుకు నిదర్శనంగా పురాణ వాజ్ఞ్మయం ప్రకారం పాల్గుణ పున్నమి నాడు, గోవిందుడు ఊయల యందు శయనించును. గాన దీనికి "డోలికా" ఉత్సవము అని ప్రతీతి. అందువలన ఎంత చిన్నదైనా ఊయల ప్రతిమను దానం చేస్తే వైకుంఠవాసి అవుతారని నమ్మకం.

        ఇక హోలిక వృత్తాంతం పేరిట " హోలీ" గా పిలువ బడుతోంది. గనుక రంగులు జల్లు కోవడం ఒక వినోదం ఆన్న మాట.

View Comments(3)    Post a Comment    By - Rajeshwari Nedunuri