Type In Telugu
Article 982


కవిత్వములోని త్రివిధ పాకములు   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1017
Votes: 3  (Vote) Posted On 6/2/2011 @10:16:06 PM

        శ్రీనాథ కవిసార్వభౌములు వెలయించిన అద్భుత రసవత్ప్రబంధం "శృంగార నైషధము". ఈ కావ్యం రసజ్ఞుల ప్రశంసలను అందుకొని, "ఆంధ్ర పంచకావ్యములు" లో అగ్రస్థానమును అలంకరించినది. దీనికి మూలం సంస్కృతములో శ్రీహర్ష మహాకవి విరచించిన "నైషధము".

        సంస్కృత కావ్యములన్నింటిలో "నైషధం విద్వదౌషధం" అని ప్రసిద్ధి! అనగా, హేమాహేమీలైన పండితప్రకాండుల మేధస్సులకే పని కల్పించే పరమ ఔషధమట ఆ కావ్యం!....... శ్రీహర్షుని కవితాసామర్థ్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీనాథులవారు ఇలా అన్నారు.
పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ
ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్య లౌ
నని కొనియాడనేర, రది యట్టిద! లేజవరాలు చెక్కు గీ
టిన వసవల్చు బాలకుడు డెందమునం గలగంగ నేర్చునే
        కవిత్వములోని స్థాయీభేదములను బట్టి ప్రాచీనసాహిత్యమును లాక్షణికులు 3 విధములుగా వర్గీకరించారు.

1. ద్రాక్షాపాకము:
ఒకసారి చదవగానే తేలికగా అర్థమై హృదయానికి ఉల్లాసమును, సంతోషమును కలిగించే కవిత్వమును ద్రాక్షాపాకముగా చెప్పుకోవచ్చు. ద్రాక్షపళ్ళు తిని ఆనందించడానికి మనమేమీ శ్రమపడే అవసరం లేదుకదా! నోట్లో వేసుకుంటే చాలు!


2. కదళీపాకము:
అర్థగాంభీర్యముతో కూడుకునివుండి, కొంత కష్టపడినమీదటగాని ఆస్వాదనకు రానటువంటి కవిత్వమును కదళీపాకముగా అభివర్ణించవచ్చు. అరటిపళ్ళు ఆరగించాలంటే కొద్దిగానైనా పనివుంటుంది కదా (తొక్క తీయడం వగైరా)!



View Comments(3)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2         Page