Type In Telugu
Article 996


వాగ్గేయకార వైభవ ' ఆద్యక్షరి '   (Page 1 Of 8)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 2207
Votes: 16  (Vote) Posted On 11/6/2011 @12:58:16 PM

        అంత్యాక్షరి తెలుసుకాని, ఈ "ఆద్యక్షరి" ఏమిటి?! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా?....... కాస్త ముందుకు పదండి, మీకే తెలుస్తుంది.

        మూడు సంవత్సరముల క్రితం కొంతమంది తెలుగుభాషాభిమానులు పూనుకొని మా ఊళ్ళో (మంచిర్యాలలో) "సాహితీ సంరక్షణ సమితి" అనే సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ ఆధ్వర్యములో ప్రతి నెల 3వ, 4వ ఆదివారపు సాయంత్రాల్లో సాహిత్యసమావేశములు జరుగుతుంటాయి. నేను కూడా ఈ సంస్థలో సభ్యుడినే! సాధారణంగా కవిసమ్మేళనము, ఒక సాహితీప్రసంగం ఏర్పాటు చేస్తుంటారు. నేను సైతం కొన్ని సాహిత్యప్రసంగములు చేశాను లోగడ!

        ఐతే, ఒకే మూసలో వెళ్తున్న కార్యక్రమాలకు కొంత వైవిధ్యం తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచనతో, ఇటీవల నేను ఒక క్రొత్త ప్రయోగం చేశాను. దాని గురించి మీకు తెలపడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

        మనకు అన్నమాచార్యుడు, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య, తూము నరసింహదాసు, సదాశివబ్రహ్మేంద్రస్వామి, నారాయణతీర్థులు, జయదేవుడు మొదలైన వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. వారందరూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు, కృతులు రచించి, గానం చేశారు. వీరి కీర్తనలను ఆధారం చేసుకుని, నేను ఈ నూతనప్రక్రియకు రూపకల్పన చేశాను.

        సెప్టెంబరు నెలలోని 3వ ఆదివారమైన 18/09/2011 నాటి సాయంత్రం మావూళ్ళోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రాంగణములో పై కార్యక్రమాన్ని నిర్వహించాను.

        రండి! మీరు కూడా ఈ కార్యక్రమములో పాలుపంచుకొని ఆనందించండి!

        ఆనాటి సమావేశానికి స్థానిక మధురగాయకులు పి.దక్షిణామూర్తిగారు అధ్యక్షత వహించారు. స్థానిక సంగీత విద్వాంసురాలు శ్రీమతి నెమలికొండ వైదేహిగారు, ఇక్కడి సీనియర్ మోస్ట్ వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రావుగారు, ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్ బద్రినారాయణగారు ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించారు. అధ్యక్షులవారి తొలిపలుకుల అనంతరం, నేను కొద్దిసేపు ప్రసంగించాను... ఈ క్రిందివిధంగా!


View Comments(14)    Post a Comment    By - Satyanarayana Piska
 
      1  2  3  4  5         Page