| చెలిమి చేసిన మేలు
(Page 1 Of 2)
|
Prev Article
|
Next Article
|
|
|
User Rating :    
|
Number Of Views : 29
|
|
Votes: 1 (Vote)
|
Posted On 7/22/2010 @8:58:26 AM
|
పినాకిని నదీ తీరంలోని ఒక ప్రదేశములో కొన్ని ఎలుకలు స్థావరంగా చేసుకొని, చుట్టుపక్కల దొరికిన ఆహారధాన్యాలు తిని తిరుగుతూ వుండేవి. వాటిలో ఒక ఎలుక పిల్లకు హుషారు ఎక్కువ. ఎప్పుడూ ఆ పరిసరాల్లోనే తిరుగుతూ వున్నందున దానికి విసుగు పుట్టి... అలా... అలా తిరిగి ఏదైనా కొత్త ప్రాంతం చూడాలని, తోటి ఎలుకలు వారిస్తున్నా వినకుండా బయలుదేరింది. కొత్త, కొత్త ప్రదేశాలను చూస్తూ, ఎంతో వుత్సాహంగా సాగిపొతూ వుంది. ఆ ఆనందంలో పరిసరాలను సైతం గమనించక పోవటముతో ఆహారము కోసము పొంచి యున్న ఒక పక్షి కంటిలో పడింది. తన కాళ్ళతో లటుక్కున ఎలుక పిల్లను పట్టేసింది పక్షి. ఉహించని పరిణామానికి బిత్తర పోయి కెవ్వున అరిచింది ఎలుకపిల్ల. ఆ పైన తెప్పరిల్లి.. "అయ్యో..అయ్యో..!నన్ను వదిలేయ్.. నీకు పుణ్యం వుంటుంది..." అంది ఎలుకపిల్ల. "పుణ్యం సంగతి దేవుడెరుగు..! రెండు రోజుల నుండి నేను ... నా పిల్లలు తిండి దొరక్క అల్లాడిపోతున్నాము. లడ్డులా దొరికావు నిన్నెలా వదలను.." అంది పక్షి. అంతలో అక్కడకు పక్షి పిల్లలు ఎగురుతూ వచ్చాయి. వాటిని చూసిన పక్షి."ఇదిగో పిల్లలూ ..! మనకు మంచి ఆహారం దొరికింది. రండి... తిందురు గాని..." అని పిలిచింది. "అమ్మా..పక్షి తల్లీ..! నాకు మరి కొంత కాలము బ్రతకాలని వుంది. దయ చేసి నన్ను వదలిపెట్టు..." ఎలుక పిల్ల దీనంగా ఏడుస్తూ ... పక్షిని బతిమలాడ సాగింది. ఆ దృశ్యం చూసిన పక్షి పిల్లలకు " అయ్యో...!" అనిపించింది. "పోనీలేమ్మా అది భయపడి ఏడుస్తూ వుంది... మరికొంత కాలం బ్రతకాలని ఆశ పడుతూ వుంది. పాపం వదిలి పెడదాము..." అన్నాయి పక్షి పిల్లలు.
|
|
View Comments(0)
Post a Comment
|
By - Audisesha Reddy Kypu |
| |
1
2
|