Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Telugu Literature  రెండవ ప్రపంచతెలుగురచయితల మహాసభలు

Previous Thread Next Thread


       
1-2 Of 2 Responses  
Page 1 of 1 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #2

Maganti
Chantabbay
Name: Maganti Kumar

Post Number: 133
Points: 1,730   History  
Member Since: Jan 2, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, August 14, 2011 @1:29:58 AM EST  

"...సికిందరాబాదులో ధూమశకటం నిల్చు స్థలమునకు.."

అంత గ్రాంథికం మాట్లాడాలని ఆయనా అనలేదండి.అసలు వ్యవహారంలో అలవాటుగా స్థిరపడిపోతున్న ఆంగ్లపదాలను మానుకోవటం మంచిది."స్వల్ప విరామం" అన్నా అందరికీ అర్థమౌతున్నప్పుడు- కావాలని "స్మాల్ బ్రేక్ "అనటం ఎందుకండి?"మనం నడచినంత మేరా, ఆమోదయోగ్యం,అవతలివారిది చాదస్తం" అనుకోవటమే తెలుగు మరుగున పడబోతున్న స్థితికి కారణం.మాజీ అధికారభాషాసంఘ అధ్యక్షునిగా ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి.కిరణ్

"The purpose of life is to discover your gift. The meaning of life is to give it away."


          #1

Kvbsastri
Kondaveeti Donga
Name: Virabhadra Sastri Kalanadhabhatta

Post Number: 807
Points: 9,335   History
Member Since: May 31, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, August 13, 2011 @2:32:44 PM EST  

సాహిత్య రాజధాని విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పాల్గొన్న ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రసార మాధ్యమాల్లో తెలుగు ఖూనీ ఎక్కువైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విరామం తీసుకునేటపుడు, చిన్న విరామం అనో స్వల్ప విరామం అనో కాకుండా "ఇప్పుడో స్మాల్ బ్రేక్ తీసుకుందాం" అనడం ఫ్యాషనైపోయిందని పేర్కొన్నారు.
-------------
సేవకా సేవకా
ఎవర్నండి
నిన్నేరా
సేవకా అంటే అర్ధం కాలేదు
అది నీవిధినిర్వహణనామం
ఏమిటో అర్ధంకాలే
సరే పోయి ఒక త్రిచక్రవాహనము కొనితెమ్ము
త్రిచిక్రవాహనమా?అంటే
అదేరా! దానిపై మనం బయటకు వెళ్ళెదమే అది
ఓహో ఆటోనాండి
ఛీమూర్ఖా! ఆంగ్లపదం వాడెదవు!దానినే కొనితెమ్ము
ఎక్కడకండి
సికిందరాబాదులో ధూమశకటం నిల్చు స్థలమునకు
ధూమశకటం అంటే
అదేరా! పొగబండి అందురే! అది
ఓహో రైల్వేస్టేషనాండి
అవునురా శుంఠా!
............
స్వల్పవిరామం అనడానికి బదులు ఇప్పుడో స్మాల్ బ్రేక్ తీసుకుందాం ..ఇదీ తెలుగుస్థితి
నిత్యజీవితంలో ఒకభాగమైపోయిన ఇంగ్లీషుపదాలు మనం అనుకోకుండా వాడతాం. ఇదికూడా ఘోరమైన తప్పు కింద చూపితే ఎలా?
అసలు తెలుగును పూర్తిగా విస్మరించి ఇలా ఇంగ్లీషులోనే మాట్లాడుతే అది తప్పు. మాతృభాషకు ద్రోహం చేస్తున్నట్టుగా భావించాలి అని నావుద్దేశ్యం
అయితే అసలు ప్రమాదం మనముందుతరం వాళ్ళగురించి ఆంగ్లమాధ్యమంలో బోధన జరుగుతున్న ఈతరుణంలో వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పటికీ, తెలుగు వ్రాయడం చదవడం పూర్తిగా విస్మరించే ప్రమాదం వుంది. తెలుగు మాటలని ఆంగ్లలిపిలో వ్రాసి చదివే దుస్థితి ఏర్పడుతోంది. కనుక తల్లి తండ్రులూ, బళ్ళో పంతుళ్ళూ ఈప్రమాదాన్ని మీరే అరికట్టగలరు. పిల్లలచే తెలుగులో వ్రాయించండి. తెలుగులో చదివించండి. అప్పుడు ఎన్ని తరాలుమారినా తెలుగు భాషకు ఢోకావుండదని నేను విశ్వసిస్తున్నాను.
ప్రపంచ రచయితల రెండవ మహాసభలలో దీనినికూడా పరిగణిస్తారని అశిస్తూ
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
విజయవాడ
13-8-2011
ఇది ఈనాడు పేపరుకు నేను వ్రాసి పంపిన వ్యాఖ్య
చూద్దాం పేపర్లో వేస్తారో లేక బుట్టదాఖలా చేస్తారొ?
శాస్త్రిశేషజీవితం ఓపిక వున్నంతవరకు సాహిత్యకార్యకలాపాలతోను, సామాజిక సేవలోను గడపాలని ఆశ


Page 1 of 1 Go To Page:   Previous Page     Next Page

Discussion Home  Telugu Literature  రెండవ ప్రపంచతెలుగురచయితల మహాసభలు

Previous Thread Next Thread