Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Telugu Literature  తెలుగు తిథులు

Previous Thread Next Thread


       
1-7 Of 7 Responses  
Page 1 of 1 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #7

Happy2010
Gang Leader
Name: Sivaji

Post Number: 3098
Points: 39,991   History
Member Since: Jan 11, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 16, 2011 @11:57:23 PM EST  


Deccan_charger, Post Number : 839







ek pyar ka nagma hai... mojom ki ravani hai.. jindagi aur kuch bi nahi... teri meri kahani hai.... ek pyar ka...

          #6

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 16082
Points: 214,616   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 16, 2011 @12:41:22 PM EST  

Deccan_charger, Post Number : 839


పిల్లలకు ఇలా నేర్పిస్తుంటే చాలా ఆనందంగాను, తృప్తిగానూ ఉంటుంది



DC

మా పిల్లలకి కూడా నేను తెలుగు నేర్పిస్తున్నా. మనకు చెప్పే ఓపిక వాళ్లకి నేర్చుకోవాలనే కుతూహలం ఉంటే కానీ కుదరదు


          #5

Chaduvu
Gang Leader
Name: Satyanarayana Piska

Post Number: 4362
Points: 53,392   History
Member Since: Jul 16, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, October 30, 2011 @2:16:10 AM EST  


Deccan_charger, Post Number : 839




very good. Keep it up.


          #4

Deccan_charger
Kondaveeti Donga
Name: Captain Of The Team

Post Number: 839
Points: 0   History
Member Since: Apr 15, 2010
Status :

Rating:
Votes: 2  (Vote)

Posted On Saturday, October 29, 2011 @4:26:50 PM EST  


Kvbsastri, Post Number : 826




ఈ రోజు మా ప్రక్కింటి వాళ్ళ పాపకు (అమ్ములు - 4వ తరగతి చదువుతోంది) , భాగవతం లోని రెండు పద్యాలు నేర్పించా.

1. శూలాయుధ హస్తుండై
2. ఏలితివి మూడు జగముల

రెండో పద్యంలో "ఇంద్రాది" అనే పదం ఆ పాపకి పలకరాలేదు, ఎన్నిసార్లు చెప్పినా "ఇంద్రాని" అని అంటోంది.
ఇక ఇలా కాదని, ఇంద్ర, ఆది సినిమాలు తెలుసా? అని అడిగా.
తెలుసంది (ఇవి మాత్రం పిల్లలకు బాగా తెలుస్తున్నాయి)
అయితే ఆ రెంటినీ బ్యాక్ టూ బ్యాక్ స్పీడ్ గా చెప్పు, అని చెప్పించా...
అప్పుడు చక్కగా చెప్పింది.
ఆంగ్లం మాత్రం అవలీలగా మాట్లాడగలదు ఈ పాప. ఏంటో, తెలుగు చదవరాదు, పలుకరాదు వీళ్ళకు.

ఇదివరకు 4 భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తే, కాంపెటీషన్ లో పాల్గొని, చిన్న భగవద్గీత పుస్తకం గెలుచుకుని వచ్చి, నువ్వే నేర్పావుగా తీసుకో అని ఇవ్వబోయింది.
నీ దగ్గరే పెట్టుకుని అవన్నీ నేర్చుకో అని చెప్పా.

పిల్లలకు ఇలా నేర్పిస్తుంటే చాలా ఆనందంగాను, తృప్తిగానూ ఉంటుంది. కాని, చాలా ఓపిక అవసరం.....



I'm on


Think only +ve.


          #3

Deccan_charger
Kondaveeti Donga
Name: Captain Of The Team

Post Number: 838
Points: 0   History
Member Since: Apr 15, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, October 29, 2011 @3:58:08 PM EST  


Kvbsastri, Post Number : 826




Sastri Garu

సోదరి చేతి వంట తప్పకుండా తినాల్సిన రోజు ఒకటుందని గతంలో విన్నాను. కాని, అది ఏ రోజు అనేది మరిచా, మీ వలన ఇప్పుడది తెలిసింది. ధన్యవాదాలు



I'm on


Think only +ve.


          #2

Yamakinkarudu
Chiranjeevi
Name: యమ కింకరుడు

Post Number: 53099
Points: 548,840   History
Member Since: Apr 23, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, October 29, 2011 @9:08:38 AM EST  


Kvbsastri, Post Number : 826



శాస్త్రిగారూ...



Pain is temporary, but Pride and Accomplishment are permanent.

          #1

Kvbsastri
Kondaveeti Donga
Name: Virabhadra Sastri Kalanadhabhatta

Post Number: 826
Points: 9,335   History
Member Since: May 31, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, October 29, 2011 @12:25:27 AM EST  

మాచిన్నతనంలో తెలుగు వత్సరాలు, మాసాలు, తిథులు, వారాలు ఒకటో క్లాసులో చెప్పేవారు
అవి మన తెలుగు సంస్కృతిని ప్రతిపంబించేవి
ముఖ్యంగా తిథులు చెప్పేవిధానం వల్ల మన పండుగలు గుర్తుకుచేసేవి

పాడ్యమి .. సంవత్సరాది పాడ్యమి
విదియ .. యమ విదియ భగినీహస్తభోజనం (దీనినిగురించి క్రింద ఒక కధ పోస్ట్ చేసాను)
తదియ .. అట్లతదీయ
చవితి.. వినాయక చవితి, నాగుల చవితి
పంచమి .. ఋషిపంచమి
షష్టి : సుబ్బారాయుడి షష్టి
సప్తమి .. రధసప్తమి
అష్టమి .. శ్రీకృష్ణాష్టమి, దుర్గాష్టమి
నవమి .. శ్రీరామనవమి
దశమి .. విజయదశమి
ఏకాదశి .. భీష్మ ఏకాదశి
ద్వాదశి .. చిలుకుద్వాదశి, కార్తీకద్వాదశి
త్రయోదశి .. శనిత్రయోదశి
చతుర్దశి .. నరక చతుర్దశి
పౌర్ణమి .. కార్తీకపౌర్ణమి, గురుపౌర్ణమి
అమావాస్య .. దీపావళి అమావాస్య, మహాలయ అమావాస్య

ఈ పదిహేనున్నూ తెలుగు తిథులపేర్లు
ఇలా బట్టీయంచేయించేవారు
మాపిల్లలకీ, మనుమలికీ నేనుకూడా చెప్పి బట్టీపట్టించాను

భ్రాతృవిదియ (భగినీహస్త భోజనం)
దీనిని కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని ‘యమద్వితీయ’ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాదుల పూజ చేస్తారు. భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరింది. తీరిక చిక్కని పనుల మూలంగా చాలాకాలం ఆమె కోర్కె తీర్చలేకపోయాడు. తుదకు యముడు ఒకనాడు యమున యింటికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆమె ఎంతో మర్యాద చేసింది. యముణ్ణి, అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని, వారి పరివారాన్ని పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించింది. ఆమె చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించమని కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు "ఏ సోదరి ఈనాడు సొదరుని తన ఇంటికి ఆహ్వానించి తన చేతివంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుంది" అని కూడా వరమిచ్చారు.
యమునికి మరియు యమునకు ఇటువంటి సోదర ప్రేమ నడచిన విదియ కాబట్టి దీనికి ‘యమద్వితీయ’ అనే పేరు వచ్చింది. ఈనాడు ప్రధానమైన ఆచారం సోదరి తన అన్నదమ్ములను ఇంటికి ఆహ్వానించి పూజించి, క్రొత్తబట్టలు పెట్టి గౌరవించడం. ఈ ఆచారం ఏర్పడిన తరువాత ఈ పర్వదినానికి ‘భాతృవిదియ’, ‘భగినీ హస్తభోజనము’ అనే పేర్లు వచ్చాయి



శేషజీవితం ఓపిక వున్నంతవరకు సాహిత్యకార్యకలాపాలతోను, సామాజిక సేవలోను గడపాలని ఆశ


Page 1 of 1 Go To Page:   Previous Page     Next Page

Discussion Home  Telugu Literature  తెలుగు తిథులు

Previous Thread Next Thread