దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-6 Of 6 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అగణిత జన్మకర్మ దురితాంబుధిలో బహు దుఃఖవీచికల్
దెగిపడ నీదలేక జగతీధవ! నీ పదభక్తినావచేఁ
దగిలి తరింపఁ గోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ పవే
తగదని చిత్తమందిడక, దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
విగతనమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గగనధునీ మరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
ద్ద్విజ్జముని కోటికెల్లఁ గులదేవతయ్యు దినేశ వంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
డ్ఢ్వజ! మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుడుగా జనించి, కుజనావళినెల్ల నడంచి, రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై
తనరిన వేల్పవీవె గద! దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖ కం
చెర్ల కులోద్భవుండన బ్రసిద్ధుడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ! నీకు దాసుడను! దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ! జానకీ
కువలయనేత్రి గబ్బిచనుగొండల నుండు ఘనంబ! మైథిలీ
నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవె కాఁ
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION