సుమతీ శతకము - బద్దెన


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-7 Of 7 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అక్కఱకురాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ!
వివరణ
అవసరమునకు పనికిరాని చుట్టమును, మ్రొక్కినా వరమీయని దేవతను, యుద్ధసమయంలో తాను ఎక్కిన పరుగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలెను

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ!
వివరణ
అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.

అడియాస కొలువుఁ గొలవకు
గుడిమణియము సేయఁబోకు , కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ !
వివరణ
వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయములేకుండా ఒంటరిగా పోకుము

అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !
వివరణ
పెదవి కదలీ కదలకుండా తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికారవ్యాధిచే నిండిన చెవిటి గ్రుడ్డి పీనుగువంటి అధికారిని జూచుట పాపము

అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
వివరణ
ఋణము ఇచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడు ప్రవహించు నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసించుము. వారు లేనట్టి గ్రామమునందు ప్రవేశింపకుము

అప్పుగొని చేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపరాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ !
వివరణ
ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచుభార్య, తప్పిదములను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానిదై చివరకు హాని తెచ్చిపెట్టును

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
వివరణ
అల్లుని మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ణ్జానము, ఆడుదానియందు నిజము, పొల్లుధాన్యములో బియ్యము తెల్లనిరంగుకాకులు లోకములో వుండవు