నరసింహ శతకము - శేషప్పకవి


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-9 Of 9 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అడవి పక్షులకెవ్వఁ డాహారమిచ్చెను - మృగజాతికెవ్వఁడు మేఁతఁ బెట్టె?
వనచరాదులకు భోజనమెవ్వడిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్ళు చేది పోసె?
స్త్రీలగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణులకెవ్వఁడు పోసెఁ బరఁగపాలు?
మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించెఁ - బసులకెవ్వఁడొసంగెఁ బచ్చిపూరి?

జీవ కోట్లనుఁ బోషింప నీవెగాని,
వేఱెయొక దాత లేఁడయ్య వెదకిచూడ!
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అతిలోభులను భిక్ష మడుగబోవుట రోత - తన ద్రవ్య మొకరింట దాచ రోత
గుణహీనుడగువాని కొలువుఁ గొల్చుట రోత - యొరుల పంచల క్రింద నుండ రోత
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత - గుఱిలేని బంధులగూడ రోత
యాదాయములు లేక యప్పుఁదీయుట రోత - జారచోరుల గూడి చనుట రోత

యాదిలక్ష్మీశ! నీ బంటు నైతినయ్య!
యింక నెడబాపు జన్మం బదెన్న రోత
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే - పసుల నార్జించుట పాడి కొరకె
సతినిఁ బెండ్లాడుట సంసారసుఖముకే - సుతులఁ బోషించుట గతుల కొరకె
సైన్యమున్ గూర్చుట శత్రు భయంబుకే - సాము నేర్చుటలెల్లఁ జావు కొరకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే - ఘనముగా చదువుట కడుపు కొరకె

యితర కామంబుఁ గోరక సతతముగను
భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని - పాటిగా సత్యముల్ బలుకనేర
సత్కార్యవిఘ్నముల్ సలుప నేర్చితిఁ గాని - యిష్టమొందగ నిర్వహింపనేర
నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిఁ గాని - చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లీయంగ వద్దనంగ నేర్చితిఁ గాని - శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేర

పంకజాతాక్ష! నే నతి పాతకుడను
దప్పులన్నియు క్షమియింపఁ దండ్రి వీవె
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అధిక విద్యావంతు లప్రయోజకులైరి - పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె - వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్ర్యమొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్టమానవులు వర్ధిష్ణులైరి

పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తి లేదాయె! నిక నీవె చాటు మాకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అమరేంద్ర వినుత! నిన్ననుసరించినవారు - ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను - నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించు నన్ గడతేర్చు వేగమే - నీ సేవకుని జేయు నిశ్చయముగ
కాపాడినను నీకు గైంకర్యపరుడనై - చెలగి నీ పనులను జేయువాడ

ననుచుఁ బలుమారు వేడెద నబ్జనాభ!
నాకుఁ బ్రత్యక్షమగు! నిన్నె నమ్మినాను!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అమరేంద్రవినుత! నేనతి దురాత్ముడనంచుఁ - గలలోన నైనను గనులఁ బడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె - దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి - నీ స్వరూపము జేసి నిలుపుకొంచు
ధూపదీపము లిచ్చి తులసితోఁ బూజించి - నిత్య నైవేద్యముల్ నేమముగను

నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలిగె నా కింతె చాలు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అర్థివాండ్రకు నీక హాని జేయుటకంటె - తెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆడుబిడ్డల సొమ్ము లపహరించుటకంటె - బండఁ గట్టుక నూతఁ బడుట మేలు
పరుల కాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె - బడబాగ్నికీలలఁ బడుట మేలు
బ్రతుకజాలక దొంగపనులు సేయుటకంటె - కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు

జలజదళనేత్ర! నీ భక్తజనుల తోడి
జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అవనిలో గల యాత్రలన్ని చేయగవచ్చు - ముఖ్యుడై నదులందు మునగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వగవచ్చు - తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు విరిచి చెప్పగవచ్చు - శ్రేష్ఠయాగములెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు - నైష్ఠికాచారముల్ నడపవచ్చు

చిత్త మన్యస్థలంబున జేరకుండ
నీ పదాంభోజములయందు నిలపరాదు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION